గుంటూరు: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు బార్య విజయలక్ష్మి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తమను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తమతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ మేరకు ఆమె హౌజ్ మోహస్ పిటిషన్ దాఖలు చేశారు. శాంతి భద్రతల సమస్య ఉందని, పోలీసులు రక్షన కల్పించడంలో విఫలమయ్యారని పిటిషన్‌లో స్పష్టం చేశారు. 24 గంటల పాటు తమకు రక్షణ కల్పించాలని కోరారు.
కాగా, టీడీపీ గూండాలు.. శనివారం ఉదయం అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించిన టీడీపీ గూండాలు.. ఆయనపై కూడా హత్యాయత్నం చేశారు. కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. ఇంట్లో ఫర్నీచర్, కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వరంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ గూండాలు.. విధ్వంసం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రౌడీయిజం ప్రదర్శించారు.
టీడీపీ గూండాల దాడిని అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. మైక్‌సెట్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పచ్చ గూండాలు అరాచకం సృష్టించారు. దాడులను అడ్డుకున్న పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసులను అంబటి ప్రశ్నించగా.. నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు.
ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండంటూ అంబటి రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. అంబటి నివాసానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మరోవైపు, అంబటి ఇంటి వద్ద టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బూతులు తిడుతూ టీడీపీ గూండాలు వీరంగం చేశారు. దాడి చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. టీడీపీ గూండాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నారు.


