అంబటిపై హత్యాయత్నాన్ని ఖండించిన ముద్రగడ | Mudragada Condemned The Attack On Ambati Rambabu House | Sakshi
Sakshi News home page

అంబటిపై హత్యాయత్నాన్ని ఖండించిన ముద్రగడ

Jan 31 2026 7:04 PM | Updated on Jan 31 2026 7:12 PM

Mudragada Condemned The Attack On Ambati Rambabu House

సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, పార్టీ అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. టీడీపీ గూండాల దాడులు అత్యంత హేయనీయం అన్నారు. అధికారం ఉందని చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని.. రాష్ట్రం మీ ఎస్టేట్‌ కాదు.. ప్రజలు మీ బానిసలు కాదు.. ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి అంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గుండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అంబటి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారని.. రాష్ట్రంలో జంగిల్ రాజు ప్రభుత్వం నడుస్తోందంటూ మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నప్పుడల్లా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. 1000 మందికి పైగా వెళ్లి హత్య చేయాలని ప్లాన్ చేశారు.

రోజులన్నీ ఒకేలా ఉండవు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. వడ్డీతో సహా మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాము. కర్రలు రాడ్లు పట్టుకొని అంబటి రాంబాబును చంపాలని చూస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రాంబాబుని చంపాలని చూశారు. కాపులను చంపడం తెలుగుదేశం పార్టీకి కొత్తమీ కాదు. గతంలో వంగవీటి రంగాను చంపించారు. నేడు అంబటి రాంబాబును చంపాలని చూస్తున్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం ను చంపాలని చూశారు. మీ దాడులను చూస్తూ వైఎస్సార్‌సీపీ ఊరుకోదు’’ అని గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement