గుంటూరు: తమ నేతకు ప్రాణ హాని ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ పట్టించుకోవడం లేదు. పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పాటు స్వయంగా వైఎస్సార్‌సీపీ నేతలు.. ఎస్పీని కలిసేందుకు ఆఫీస్‌కు వెళ్లారు. అయితే ఎస్పీ ఆఫీస్ తలుపులు కొడుతున్నా పట్టించుకోనట్లే ఉండిపోయారు.
ఎస్సీని కలిసేందుక వెళ్లిన వారిలో మాజీ హోంమంత్రి సుచరిత, మోదుగుల, అన్నాబత్తుని శివకుమార్, డైమండ్ బాబులు ఉన్నారు. అయితే వారు ఎస్పీ గేటు ముందే నిలబడి పిలిచినా సిబ్బంది పట్టించుకోలేదు.

దీనిపై సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఉదయం ఆయనపై హత్యాయత్నం జరిగింది. అంబటిపై టీడీపీ గూండాల హత్యాయత్నం చేశారు. అంబటికి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోవడం లేదు’అని పేర్కొన్నారు.


