విశాఖపట్నం : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విశాఖ ద్వారక నగర్ లోని ఎంఎస్‌ఎంఈ (MSME) ఫోకస్డ్ ఎన్‌బీఎఫ్‌సీ 'సారథి ఫైనాన్స్' ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు.
సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలపై (MSME) దృష్టి సారించే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) 'సారథి ఫైనాన్స్' ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సంస్థ చేపడుతున్న దేశవ్యాప్త సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రక్తదానం చేసేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. ఒక వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా ఆరుగురు వ్యక్తులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని, రక్తం నుంచి ప్లాస్మా, ప్లేట్ లెట్లు, ఎర్ర,తెల్ల రక్త కణాలు వంటి కంపోనెంట్లు అందించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.
దాదాపు10 లీటర్ల రక్తాన్ని సేకరించి, స్థానిక ఆసుపత్రుల్లోని రోగుల అవసరాల కోసం రక్త నిల్వల కొరతను తీర్చడానికి అందజేశారు. స్థానిక ఆరోగ్య వ్యవస్థలకు మద్దతుగా సారథి ఫైనాన్స్ దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఇటువంటి డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, కస్టమర్లు, భాగస్వాములు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


