అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు భద్రతపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేసిన నేపథ్యంలో డీజీపీకి లేఖ రాసింది వైఎస్సార్‌సీపీ. అంంబటి ప్రాణానికి ముప్పు ఉందంటూ వైఎస్సార్‌సీపీ ఆందోళన చెందుతోంది. దీనిలో భాగంగా చీఫ్ సెక్రటరీ, డీజీపీకి లేఖలు రాసింది. అయితే చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఫోన్లు ఎత్తలేదు.
దాంతో అంబటికి కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని డీజీపీకి లేఖ రాయడంతో పాటు మెయిల్ చేసింది వైఎస్సార్‌సీపీ . అంబటి ఇంటివద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉందని, డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలని లేఖలో పేర్కొంది. అంబటి ప్రాణానికి ముప్పు ఉందని,, మూడు గంటలకుపైగా అక్కడే ఉండి టీడీపీ శ్రేణులు రెచ్చగొడుతున్నాయని లేఖ ద్వారా స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
మాజీ మంత్రి అంబటిపై హత్యాయత్నం
‘ఏపీలో చట్టం లేదు.. రెడ్‌బుక్ పాలన నడుస్తోంది’


