సాక్షి, గుంటూరు: అంబటి రాంబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేశారు. టీడీపీ గూండాల హత్యాయత్నానికి గురైన అంబటిని పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయిందన్నారు. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోయాయన్న వైఎస్ జగన్.. ఉద్దేశపూక్వకంగానే హత్యాయత్నం, దాడులకు దిగారన్నారు. ప్రజలన్నీ చూస్తున్నారు. ఈ అరాచకపాలనను ప్రజలు సహించబోరు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారు. అంబటికి పార్టీ మొత్తం అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
అంబటిపై టీడీపీ గూండాల హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీ సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేసింది. లడ్డూ విషయంలో సిట్ ల్యాబ్ రిపోర్టుల ఫలితాలతో అడ్డంగా దొరికిపోవడంతో బాబు హింసను రాజేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. దాంట్లో భాగంగానే వరుస దాడులు జరుగుతున్నాయన్న వైఎస్సార్‌సీపీ.. పథకం ప్రకారమే అంబటిపై హత్యాయత్నం చేశారని పేర్కొంది. అంబటిపై హత్యాయత్నాన్ని కేంద్ర హొంశాఖ దృష్టికి వైఎస్సార్‌సీపీ తీసుకెళ్లనుంది. కేంద్ర హోంశాఖకు వైవీ సుబ్బారెడ్డి లేఖ రాయనున్నారు.


