అంబటి ఇంటికి వైఎస్సార్‌సీపీ నేతలు | Sajjala Ramakrishna Reddy Along With YSRCP Leaders Visited Ambati Rambabu House In Guntur, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అంబటి ఇంటికి వైఎస్సార్‌సీపీ నేతలు

Feb 1 2026 3:24 PM | Updated on Feb 1 2026 3:37 PM

Ysrcp Leaders Visited Ambati Rambabu House

సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్సార్‌సీపీ నేతల బృందం చేరుకుంది. నిన్న అంబటి ఇంట్లో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. అంబటి ఇంటిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పరిశీలించారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతల వెంట వచ్చిన కార్యకర్తలను బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.

అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పల్నాడు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎంపీ మోదుగుల, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ, నియెజకవర్గ ఇన్‌ఛార్జిలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్‌, డైమండ్‌ బాబు, గజ్జల భార్గవ్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌, వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement