స్పెయిన్‌ కోచ్‌ లొపెటెగుపై వేటు  | Dismay in Spain as undefeated coach fired before start of World Cup | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌ కోచ్‌ లొపెటెగుపై వేటు 

Jun 14 2018 1:13 AM | Updated on Jun 14 2018 1:13 AM

Dismay in Spain as undefeated coach fired before start of World Cup - Sakshi

ప్రపంచ కప్‌కు ముందు స్పెయిన్‌ జట్టు కోచ్‌ జులెన్‌ లొపెటెగుని తప్పించి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో ఫెర్నాండో హైరోను కొత్త కోచ్‌గా నియమించింది. ఒకవైపు స్పెయిన్‌ జట్టు ప్రపంచ కప్‌ సన్నాహాల్లో ఉండగా... టోర్నీ ముగిసిన తర్వాత లొపెటెగు తమ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తాడని ప్రఖ్యాత స్పెయిన్‌ క్లబ్‌ రియల్‌ మాడ్రిడ్‌ మంగళవారమే ప్రకటించడం అతని తొలగింపునకు కారణమని వినిపిస్తోంది. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పానిష్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ తాము సరైన చర్య తీసుకున్నట్లు ప్రకటించింది.    

Advertisement
 
Advertisement
Advertisement