1 కోటీ 50 లక్షల అభ్యర్థనలు! | Huge demand for ODI World Cup tickets | Sakshi
Sakshi News home page

1 కోటీ 50 లక్షల అభ్యర్థనలు!

Oct 14 2026 3:38 AM | Updated on Oct 14 2026 3:38 AM

Huge demand for ODI World Cup tickets

వన్డే వరల్డ్‌ కప్‌ టికెట్లకు భారీ డిమాండ్‌

దుబాయ్‌: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. 2027 అక్టోబర్‌–నవంబర్‌లలో జరిగే ఈ టోర్నీ కోసం ఇటీవలే టికెట్‌ బ్యాలెట్‌ను అందుబాటులో ఉంచారు. 12 రోజుల వ్యవధిలో మ్యాచ్‌ టికెట్ల కోసం మొత్తం 1 కోటి 50 లక్షల మంది అభిమానులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏకంగా 142 దేశాలకు చెందినవారు ఉండటం విశేషం. 

ఈ ఏడాది నవంబర్‌ 21 వరకు టికెట్ల కోసం అభిమానులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ‘టికెట్ల కోసం వస్తున్న డిమాండ్‌ వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ స్థాయిని చూపిస్తోంది. దక్షిణాఫ్రికాలో టోర్నీని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌కు విశేష ప్రచారం కల్పించిన ఐసీసీ ఇకపై కూడా అన్ని రకాలుగా వాటిని కొనసాగిస్తుంది’ అని ఐసీసీ సీఈఓ సంజోగ్‌ గుప్తా అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement