ముంబై రంజీ జట్టు కోచ్‌గా సమీర్‌ దిఘే | Sameer Dighe as coach of Mumbai Ranji team | Sakshi
Sakshi News home page

ముంబై రంజీ జట్టు కోచ్‌గా సమీర్‌ దిఘే

Jun 3 2017 1:48 AM | Updated on Sep 5 2017 12:40 PM

ముంబై రంజీ జట్టు కోచ్‌గా సమీర్‌ దిఘే

ముంబై రంజీ జట్టు కోచ్‌గా సమీర్‌ దిఘే

భారత మాజీ వికెట్‌ కీపర్‌ సమీర్‌ దిఘే, ముంబై రంజీ జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. 2017–18 సీజన్‌లో రంజీ జట్టుకు సమీర్‌ కోచ్‌గా వ్యవహరిస్తారని ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) శుక్రవారం ప్రకటించింది.

ముంబై: భారత మాజీ వికెట్‌ కీపర్‌ సమీర్‌ దిఘే, ముంబై రంజీ జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. 2017–18 సీజన్‌లో రంజీ జట్టుకు సమీర్‌ కోచ్‌గా వ్యవహరిస్తారని ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) శుక్రవారం ప్రకటించింది.

ఇప్పటివరకు కోచ్‌గా ఉన్న చంద్రకాంత్‌ పండిట్‌ స్థానంలో సమీర్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ పదవికి మరో భారత మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ ఆమ్రే పోటీపడగా అజిత్‌ అగార్కర్‌ సారథ్యంలోని ఎంసీఏ క్రికెట్‌ అభివృద్ధి కమిటీ సమీర్‌ను ఎంపికచేసింది. 48 ఏళ్ల సమీర్‌ 2000–2001 మధ్య కాలంలో భారత్‌కు 6 టెస్టులు, 23 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement