భారత్‌లో తొలి హైడ్రోజన్ కోచ్ పరీక్ష విజయవంతం | Railways Successfully Tests India First Hydroge Powered Coach | Sakshi
Sakshi News home page

భారత్‌లో తొలి హైడ్రోజన్ కోచ్ పరీక్ష విజయవంతం

Jul 25 2025 5:54 PM | Updated on Jul 25 2025 6:39 PM

Railways Successfully Tests India First Hydroge Powered Coach

దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ కోచ్‌ను విజయవంతంగా పరీక్షించి.. భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. ఈ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైళ్లు.. కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పర్యావరణానికి హానికరం కాని, స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారత్‌ అడుగులు వేస్తోంది. ఇది భారతీయ రైల్వేను మరింత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయడంతో ముందడుగు పడింది.

ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడం.. భారత్‌ని హైడ్రోజన్ ఆధారిత రైల్వే సాంకేతికతలో ప్రపంచదేశాల సరసన అగ్రగామిగా నిలబెడుతుందని అశ్విని వైష్ణవ్ ట్వీట్‌ చేశారు. భారత్‌ 1,200 HP హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసింది. ఇది దేశీయ రవాణా రంగానికి ఒక కీలక మైలురాయి’’అని ఆయన పేర్కొన్నారు. మొత్తం హైడ్రోజన్-పవర్డ్ కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్) చెన్నైలోని ఐసీఎఫ్‌ వద్ద విజయవంతంగా పరీక్షించబడిందన్నారు.

 

హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకంలో భాగంగా 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రైళ్లను దేశ వ్యాప్తంగా హెరిటేజ్, హిల్ స్టేషన్లలో నడపాలని భావిస్తోంది. భారతీయ రైల్వే ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌తో నడిచే విధంగా చేసే పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా  రైల్వేశాఖ చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement