ఏలూరు శాయ్‌లో కీచకుడు.. క్రీడాకారిణులపై కోచ్‌ లైంగిక వేధింపులు | Coach Misbehaviour With Female Athletes In Eluru Sports Authority Of India, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏలూరు శాయ్‌లో కీచకుడు.. క్రీడాకారిణులపై కోచ్‌ లైంగిక వేధింపులు

Jun 22 2025 3:51 PM | Updated on Jun 22 2025 5:14 PM

Coach Misbehaviour Female Athletes In Eluru Sports Authority Of India

సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)లో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. క్రీడాకారిణిల జీవితాలతో అథ్లెటిక్ కోచ్ వినాయక ప్రసాద్ ఆడు​కుంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణను అడ్డం పెట్టుకుని యువ క్రీడాకారిణిలతో అసభ్యంగా ప్రవర్తిసున్నాడు. ఏలూరు శాయ్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారిణిలను కోచ్‌ నిత్యం లైంగికంగా వేధిస్తున్నాడు.

ఏలూరు శాయ్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో మొత్తం 45 మంది అండర్ 15, 16, 17, 18 విభాగాల క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. గత కొంత కాలంగా క్రీడాకారిణిలను వినాయక ప్రసాద్‌ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ సెంటర్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతోన్న ఓ బాలిక పట్ల కోచ్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. వార్షిక తనిఖీల్లో భాగంగా బెంగుళూరు నుంచి వచ్చిన స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు ఆ బాలిక ఫిర్యాదు చేసింది.

కోచ్ అకృత్యాలపై రహస్యంగా విచారణ జరిపిన బెంగుళూరు బృందం.. ఆరోపణలు నిజమని తేలడంతో ఏలూరు టూ టౌన్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. కోచ్ వినాయక ప్రసాద్‌పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  శాయ్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement