ప్రతికూలమే...కానీ ప్రాణాలేం పోవులే 

Bangladesh Coach Domingo Speaks Over Air Pollution In Delhi - Sakshi

ఢిల్లీ వాయు కాలుష్యంపై బంగ్లాదేశ్‌ కోచ్‌ డొమింగో

న్యూఢిల్లీ: తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్న ఢిల్లీ నగరంలో మ్యాచ్‌ నిర్వహణకు వచ్చే ముప్పేమీ లేదని బంగ్లాదేశ్‌ కోచ్‌ రసెల్‌ డొమింగో అన్నారు. ‘వాతావరణం ప్రతికూలమే అయినా... ప్రాణాలు పోయేంత కష్టమేమీ లేదు. ఇది కేవలం మూడు గంటల ఆటే. మ్యాచ్‌ సజావుగానే జరుగుతుంది. కళ్లకు, గొంతుకు కాస్త ఇబ్బంది కలగొచ్చేమో కానీ అంతకుమించిన ముప్పేమీ ఉండదు’ అని అన్నారు. గతంలో ఇక్కడ శ్రీలంకకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందన్న సంగతి తెలుసని, బంగ్లాదేశ్‌లోనూ వాతావరణ కాలుష్యం ఉంటుందని చెప్పారు. ఇదేమీ తీవ్రంగా పరిశీలించాల్సిన అంశం కానేకాదని... ఆటగాళ్లు మ్యాచ్‌పై దృష్టి పెడితే సరిపోతుందని అన్నారు. షకీబ్‌ సస్పెన్షన్‌ ఉదంతం జట్టుపై ప్రభావం చూపుతుందని కోచ్‌ అంగీకరించారు. స్టార్‌ ఆటగాడు కీలకమైన సిరీస్‌కు లేకపోవడం లోటేనన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top