రాయల్స్‌ కోచ్‌గా ఆప్టన్‌

Paddy Upton was appointed as coach of Rajasthan Royals - Sakshi

ముంబై: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ కోచ్‌గా మళ్లీ ప్యాడీ ఆప్టన్‌ను నియమించారు. గతంలో నాలుగేళ్ల పాటు రాయల్స్‌కు ఆయన కోచ్‌గా పనిచేశారు. 2013 ఐపీఎల్‌లో శ్రీశాంత్‌ సహా ముగ్గురు స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన సీజన్‌లో ఆప్టనే కోచ్‌గా ఉన్నారు. అలాగే భారత జట్టు మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌గా విజయవంతమైన పాత్ర పోషించారు. టీమిండియా వన్డే ప్రపంచకప్‌ (2011) ఘనతలో అప్పటి హెడ్‌ కోచ్‌ కిర్‌స్టెన్‌తో పాటు ఈయనకు భాగముంది. ఐపీఎల్‌తో పాటు బిగ్‌బాష్, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ల్లోనూ పలు జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆప్టన్‌ మార్గదర్శనంలోనే సిడ్నీ థండర్స్‌ 2016లో బిగ్‌బాష్‌ విజేతగా నిలిచింది. అప్టన్‌ మళ్లీ తమ జట్టుతో కలవడం సంతోషంగా ఉందని రాయల్స్‌ సహయజమాని మనోజ్‌ తెలిపారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top