Paddy Upton: టీమిండియా మెంటల్‌ హెల్త్‌ కోచ్‌గా అప్టన్‌.. టీ20 వరల్డ్‌కప్‌ కోసం ప్రత్యేక నియామకం

Paddy Upton To Join Team India As Mental Health Conditioning Coach - Sakshi

టీమిండియా మెంటల్‌ హెల్త్‌ కండీషనింగ్‌ కోచ్‌గా ప్యాడీ అప్టన్‌ మళ్లీ నియమితుడయ్యాడు. గతంలో పలు సందర్భాల్లో టీమిండియా తరఫున ఈ బాధ్యతలు నిర్వహించిన అప్టన్‌ను ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ కోసం బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసింది. అప్టన్‌ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని, అతను విండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియాతో జాయిన్‌ అవుతాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

అప్టన్‌ 2011లో టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. అటగాళ్ల మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో అప్టన్‌కు నిపుణుడిగా మంచి పేరుంది. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో అప్టన్‌కు మంచి సంబంధాలు ఉండటంతో ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ద్రవిడ్‌ టీమిండియాలో సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి వీరిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో (ద్రవిడ్‌-రాజస్థాన్‌ రాయల్స్‌, అప్టన్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌) కూడా వివిధ ఫ్రాంచైజీలకు పని చేశారు.
చదవండి: 'అతడిని సరిగ్గా ఉపయోగించుకోండి.. మరో ఏడేళ్ల పాటు భారత్‌కు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top