హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ అజీమ్‌ మృతి

Former Hyderabad Ranji opener Abdul Azeem passes away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ క్రికెట్‌లో దూకుడైన ఓపెనర్‌గా పేరొందిన హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ అజీమ్‌ మంగళవారం కన్నుమూశారు. 62 ఏళ్ల అజీమ్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. 80, 90 దశకాల్లో హైదరాబాద్‌ మేటి ఓపెనర్‌గా వెలుగొందారు.

1986లో తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజీమ్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించారు. 1980 నుంచి 1995 వరకు క్రికెట్‌ కెరీర్‌ కొనసాగించిన ఆయన 73 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 4644 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలున్నాయి. అనంతరం హైదరాబాద్‌ జట్టుకు కోచ్‌గా, సెలక్టర్‌గా సేవలందించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top