Sarah Taylor: క్రికెట్‌ చరిత్రలో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్

Sarah Taylor Becomes First Woman Coach In Mens Franchise Cricket - Sakshi

Sarah Taylor Becomes First Woman Coach In Mens team: క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి టీమ్​ అబుదాబి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా  ఓ పురుషుల జట్టుకు మహిళా క్రికెటర్​ను కోచ్​గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజీ తెలిపింది. అబుదాబీ టీ10 లీగ్‌లో మాజీ ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్‌ను  అసిస్టెంట్​ కోచ్​గా నియమిస్తున్నట్లు  టీమ్ అబుదాబి ట్విటర్‌లో వెల్లడించింది.

దీంతో మెన్స్ ఫ్రాంఛైజీ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ సారా టేలర్ చరిత్ర సృష్టించింది. కాగా ఇంతకుముందు ఇంగ్లండ్ మెన్స్ కౌంటీ టీమ్‌ ససెక్స్‌ జట్టుకి స్పెషలిస్ట్ కోచ్‌(వికెట్ కీపింగ్ కోచ్‌)గా నూ సారా టేలర్ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇక ఇంగ్లండ్‌ సాధించిన రెండు వన్డే వరల్డ్‌ కప్‌లు, ఒక టీ20 వరల్డ్‌ కప్‌ జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. కాగా నవంబర్ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్‌ ప్రారంభం కానుంది.

చదవండిT20 World Cup 2021 Pak Vs Afg: భేష్‌.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్‌ ఖాన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top