
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు. అయితే ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు రైతులు, సాధారణ ప్రజలు పాల్గొనకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ప్రయోగించింది. అయినా పన్నాగం పారలేదు. గుట్ట, పుట్ట, చేను.. ఆంక్షలనే అడ్డుకోటను దాటారు. జననేత కోసం జనం మహా ప్రజంభనంలా పోటెత్తారు.























