breaking news
bangarupalyam
-
‘మా భర్తలకు ఏం జరిగినా ఎస్పీ, పోలీసులదే బాధ్యత’
సాక్షి, చిత్తూరు: ఏపీలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెడ్ యార్డ్ పర్యటనపై కూటమి నేతలు అక్కసు వెళ్లగక్కతున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆదేశాలు ఇచ్చి.. ఫొటోగ్రాఫర్‌పై దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా ఫొటోగ్రాఫర్ శివపై దాడి కేసులో అక్రమ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చక్రి, జీడి నెల్లూరుకు చెందిన మోహన్‌లను మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, చిత్తూరు డీటీసీకి తరలించారు. అయితే, వారిని మాత్రం పోలీసులు చూపించడం లేదు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ సందర్భంగా మోహన్ భార్య రాసాత్తి మాట్లాడుతూ..‘నా భర్త ఆరోగ్యం సరిగా లేదు.. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. రోజుకు మూడు సార్లు మందులు వేసుకోవాలి.. మూడు రోజులుగా పోలీసులు నిర్బంధంలో ఉన్నాడు.. నా భర్త మోహన్‌కు ఏం జరిగినా పోలీసులు, జిల్లా ఎస్పీనే బాధ్యత వహించాలి. మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం.. నా భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారు’ అని అన్నారు.చక్రి భార్య కవిత మాట్లాడుతూ..‘ఫొటోగ్రాఫర్‌పై దాడి చేయక పోయినా నా భర్తను అరెస్ట్ చేశారు. బాధితుడు ఫొటోగ్రాఫర్ శివ కూడా చక్రి నా కెమెరా కాపాడాడు.. నన్ను రక్షించాడు అని చెప్తున్నా నా భర్తపై తప్పుడు కేసు పెడుతున్నారు’ అని తెలిపారు. -
ఏపీ ముఖ్యమంత్రిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన సక్సెస్.. కడుపు మంటతో ఎల్లో మీడియా..
సాక్షి,తిరుపతి: కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. రైతన్నకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ చేపట్టిన బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన విజయవంతమైందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగన్ చేసిన బంగారుపాళెం పర్యటన విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఈటీవీలు విషపు రాతలతో ఆయనపై ఉన్న ద్వేషాన్ని మరోసారి చాటుకున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ కోసం వచ్చిన మామిడి రైతులను క్రూరమైన దొంగలు, అసాంఘిక శక్తులు, దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఉచ్ఛం, నీచం మరిచి పతాకశీర్షికల్లో దూషించడం ద్వారా తమ కడుపుమంటను ఎల్లో మీడియా బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును మోసేందుకు, నిత్యం భజన చేసేందుకు ఆ ప్రతికలు, మీడియా ఇంతగా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ..వైఎస్ జగన్ పర్యటనకు చిత్తూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తమ కష్టాలను చెప్పుకోవాలని తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం రెండు వేల మంది పోలీసులతో భద్రత పేరుతో అనేక ఆటంకాలు కల్పించింది. లాఠీచార్జీతో అభిమానులు, రైతులపై విరుచుకుపడింది. రహదారులను బారికెట్లతో మూసివేశారు. అయినా కూడా రైతులు గుట్టలు, పుట్టలు, కాలువలు, పొలాలు, తోటలను దాటుకుంటూ జగన్‌ను కలిసేందుకు వచ్చారు. ఇటువంటి అశేష జనవాహినిని చూసి కూటమి ప్రభుత్వానికి చెమటలు పట్టాయి. ..ఈ పర్యటన విజయవంతం అవ్వడంతో తట్టుకోలేక చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీన్, ఈటీవీలు మామిడి రైతులపై ఇష్టారీతిగా ద్వేషాన్ని, విషాన్ని కుమ్మరించాయి. రైతులను రౌడీలు, దోపిడీదారులు, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ పతాక శీర్షికల్లో రాతలు రాశారు. ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో 'బంగారుపాళెంలో దండుపాళ్యం' అంటూ వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అభిమానులను, రైతులు అరాచకం సృష్టించడానికి ప్రయత్నించారంటూ ఒక విషపు కథనాన్ని అచ్చేశారు. ..అదే పత్రికలో జగన్ పర్యటనకు అసలు జనాలే రాలేదంటూ మరో ఏడుపుగొట్టు కథనాని రాశారు. హెలిప్యాడ్ వద్దకు మూడువేల మంది జనం తోసుకువచ్చారంటూ అదే పచ్చ పత్రిక ఆంధ్రజ్యోతి మరో కథనం రాసింది. ఇలా ఏ రాస్తున్నారో కనీస స్పృహ కూడా లేకుండా ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలను ప్రచురించారు.గిట్టుబాటు రేటు ఇస్తే రైతులు రోడ్డుపై పంట పారేస్తారా?.. బంగారుపాళెంకు వచ్చింది రైతులే కాదు, ఎవరో రైతులకు చెందిన మామిడి కాయలను రోడ్డుపైన పారేశారంటూ ఇదే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసింది. వైయస్ జగన్ వస్తున్నారని కాదు, కనీసం కోత ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడం, ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి వేచిఉన్నా కొనుగోలు చేసేవారు లేక, మామిడి కాయలు కుళ్ళిపోతుండటంతో కడుపుమండిన రైతులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు మామిడి కాయలను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయిన ఘటనలు అనేక ఉన్నాయి. రైతులను ఆదుకోవడంతో, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవ్వడం వల్లే రైతులు తమ పంటను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయారు. దీనిని ఈనాడు పత్రిక తనకి నచ్చినట్లుగా వక్రీకరణ కథనాలు రాశారు. అలాగే రైతులు కానీ కొందరితో జగన్మోహన్రెడ్డి ఎందుకు వచ్చారో మాకు అర్థం కాలేదంటూ కూడా మరో విషపు కథనాన్ని రాశారు.ఎల్లో మీడియాలో దుర్మార్గమైన థంబ్‌నెయిల్స్.. వైఎస్ జగన్‌ను ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను అణువంతైనా తగ్గించలేరు. ఇక టీవీ5, ఏబీఎన్ చానెల్స్‌లో అయితే 'పోలీసులా...నరికేయండ్రా', 'డీఎస్సీని నరికేయండ్రా...' జగన్ పబ్లిక్‌గా దొరికాడు అంటూ థంబ్‌నెయిల్స్ పెట్టి మరీ దుర్మార్గమైన వీడియో కథనాలను ప్రసారం చేశారు. ..ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన నాయకుడు ఎక్కడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇలా కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆదేశాలు ఇస్తారా? 'పోలీసులపై రప్పా...రప్పా.. అంటూ రెచ్చిపోయిన జగన్', 'పరామర్శా... పొలిటికల్ ఈవెంటా?' 'పోలీసులను నరికేస్తారా...సర్కార్ ఏం చేస్తోంది' ఇలాంటి థంబ్ నెయిల్స్‌తో ఎల్లో మీడియా తన కడుపుమంటను, జగన్‌పై ఉన్న ధ్వేషాన్ని చాటుకునేందుకు సిగ్గూ,శరం లేకుండా దిగజారుడు కథనాలను ప్రచురించింది. ..గతంలో కశ్యప, భృగు, అత్రి, బృహస్పతి వంటి రుషులు లోకకళ్యాణం కోసం ప్రజలకు, పాలకులకు మంచిని బోధించేవారు. కానీ నేడు ఎల్లో మీడియా ఈ రుషులుగా భావించుకుని చంద్రబాబుకు తప్పుడు సలహాలు, విషపు కథనాలను ప్రచారం చేస్తూ అశాంతిని ఎలా రగిలించవచ్చో బోధిస్తున్నాయి. అలాగే ఈ ఎల్లో మీడియాకు టీడీపీ, జనసేన వారంతా సత్పురుషులు, వేదపండితులుగా కనిపిస్తున్నారు. వీరి నుంచి మాత్రమే ప్రజలు ఆశీస్సులను పొందాలని ఈ ఎల్లో మీడియా రుషులు చెబుతున్నారు. మిగిలిన వారంతా వారికి రాక్షసులతో సమానం.కూటమి ప్రభుత్వ సూచనల మేరకే పోలీస్ కేసులు..కూటమి ప్రభుత్వ నిర్భందాలు బద్దలు కొడుతూ రైతులు వైఎస్ జగన్ రాకను స్వాగతించారు. ఈ రైతులను మేం తీసుకురాలేదు, జన సమీకరణ అసలే చేయలేదు. పోలీసులు చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారమే పర్యటన సాగినా కూడా మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. రైతులు తమ మామిడి పంటను రోడ్డుపైన పారేస్తే, దానికి కూడా వైఎస్ జగన్ కారణమని పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారు. ..వైఎస్ జగన్‌పై కక్షసాధించాలనే తలంపుతోనే ఇలా చేస్తున్నారు. చివరికి వైఎస్ జగన్‌ను కలిసేందుకు వస్తే రౌడీషీట్లు కూడా తెరుస్తామని కూడా బెదిరించారు. మామిడి రైతులను కలుసుకునేందుకు వైయస్ జగన్ వస్తున్నారని తెలియగానే చంద్రబాబు హుటాహుటిన పల్ప్ ఫ్యాక్టరీ యజమానులుతో సమావేశం నిర్వహించారు. కేజీ రూ.6 కి కొనుగోలు చేయాల్సిందేనని ఒత్తిడి చేశారు. ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుందని ప్రకటించింది. ..అప్పటి వరకు బయట ఉన్న వందల లారీలకు స్పీడ్‌గా టోకెన్లు జారీ చేసింది. ఇవ్వన్నీ వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసిన తరువాత చేసినవే. గత ఏడాది వైఎస్ జగన్ హయాంలో మామిడికి మద్దతుధర కేజీకి రూ.29 రూపాయలు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో వస్తున్న ధర రూ.2 మాత్రమే. పొరుగురాష్ట్రం కర్ణాటకలో రెండున్నల లక్షల టన్నుల మామిడిని కేజీ రూ.16కి కొనుగోలు చేస్తామని కేంద్రాన్ని ఒప్పించుకోగలిగితే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అలా చేయలేక పోయారు? గిట్టుబాటు ధర కోసం ప్రశ్నించే పొగాకు, మిర్చి, ధాన్యం రైతులు కూడా ఈ ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వ దృష్టిలో సంఘ విద్రోహులేనా? ఆఖరి అరగంట తరువాత జగన్‌కు భద్రతను లేకుండా చేశారు..వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఆఖరి అరగంట వరకు సెక్యూరిటీని టైట్ చేసి, తరువాత భద్రతను ఎందుకు పూర్తిగా వదిలేశారు. అంటే వైఎస్ జగన్‌ను ఏమైనా చేయాలనే కుట్ర దీనిలో దాగుందా? ఎక్కడా వైఎస్ జగన్‌కు పోలీస్ రక్షణ లేకుండా చేసేశారు. జెడ్‌ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకుడి విషయంలో ఇలాగేనా చేసేది? రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉంటే, మార్కెట్ యార్డ్‌లో మూడు వందల మంది పోలీసులను మోహరింపచేశారు. కానీ ఆఖరి క్షణంలో ఆయన పక్కన ఎవరూ లేకుండా పోవడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. -
అయ్యవారిని చేయబోతే కోతి అయిందట!.. తేడా కొట్టిన బాబు స్కెచ్!
పెద్ద వీరుడొచ్చాడు.. అలాంటివాడితో పిల్లాడి బొడ్డు కోయిస్తే పెద్దయ్యాక వీడు కూడా వీరుడవుతాడని భావించిన తల్లిదండ్రులు వేలాదిమంది సమక్షంలో బిడ్డకు బొడ్డుకోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారట. ఆ మహావీరుడు జనాన్ని చూసి కత్తిని రకరకాలుగా తిప్పి.. విన్యాసాలు చేసి ఇదిగో చూడండి బొడ్డు కోస్తున్నాను అని చెప్పి ఇంకేదో కోసేశాడట.. దీంతో తల్లిదండ్రులు అయ్యో దేవుడా ఇదేందీ ఇలా జరిగిందని లోలోన కుమిలిపోతున్నారట.వాస్తవానికి వైఎస్ జగన్ పర్యటనలను ఆపడానికి.. జనం నుంచి ఆయన్ను దూరం చేయడానికి కూటమి నాయకులు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఆయన పర్యటనలను నిర్వీర్యం చేయడం.. ప్రజల్లో జగనుకు ఆదరణ తగ్గిందని చెప్పడం కోసం ఎన్నో పథకాలు వేస్తున్నారు. అయినా సరే మొన్నటి గుంటూరు పర్యటన.. అంతకుముందు కడప ఇలా జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వేలాదిగా తరలివెళ్తున్నారు. దీంతో ఇక లాభం లేదనుకుని మామిడి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వైఎస్ జగన్ మీద ప్రభుత్వం బోలెడు ఆంక్షలు విధించింది.కేవలం 500 మందికి మించకుండా కార్యకర్తలు ఆయన వెంట ఉండాలని రూల్ తెచ్చింది. అంతేకాకుండా ఆ పర్యటనకు రకరకాలుగా కండీషన్లు పెట్టారు.. కండీషన్లు పెడితే జనానికి ఎక్కడో కాలుతుంది.. సరిగ్గా జగన్ పర్యటన విషయంలో కూడా అదే జరిగింది. బంగారుపాళ్యం పర్యటనను భగ్నం చేసేందుకు మూడు నాలుగు జిల్లాల ఎస్పీలు.. 9 మంది అదనపు ఎస్పీలు అంతకు డబుల్ డీఎస్పీలు.. వందలాదిమంది ఎస్సైలు కానిస్టేబుళ్లు కలిసి మొత్తం ఓ రెండు వేల మంది పోలీసులను జగన్ పర్యటనకు మోహరించారు. అదేంది 500 మందికి మించకుండా జనాన్ని రమ్మన్నారు కదా మరి మీరేందుకు రెండు వేల మంది వచ్చారు అని ప్రజలు అడిగే ప్రశ్నలకు పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి కూడా సమాధానం కరువైంది. ఇక పోలీసుల నిర్బంధం పెరిగిన కొద్దీ ప్రజల్లో కసి పెరిగింది. ఎవరో ఎస్సై వచ్చి మమ్మల్ని నియంత్రించడం ఏందీ.. మేము సినిమాకు వెళ్లాలా.. జాతరకు వెళ్లాలా.. జగన్ పర్యటనకు వెళ్లాలా అనేది మా ఇష్టం. మధ్యలో వీళ్ళ జోకుడు ఏమిటన్న ఫీల్ జనంలో మొదలైంది. ఒక్క చినుకుగా ప్రారంభమైన ఈ ఆత్మాభిమానం ఉప్పెనలా మారింది. గ్రామాలు దండుకట్టాయి.. పల్లెలు పరవశించాయి.. ఇంకేముంది మళ్ళీ వింటేజ్ జగన్ ఆవిష్కృతమయ్యారు.ఎక్కడికక్కడ వందలు వేలల్లో ప్రజలు చెట్టూ పుట్టా వాగు వంక దాటుకుని జగన్ వెంట నడిచారు.. మొత్తానికి నిర్బంధం ఎంత ఎక్కువైతే ప్రతిఘటన అంతకు వందింతలు ఉంటుందని ప్రజలు నిరూపించారు. పల్లెల్లో పోలీసుల రుబాబు పెరిగేసరికి అదే మొత్తంలో జగన్ పట్ల అభిమానం ఆదరణ రెట్టింపు అయ్యింది. దీంతో అయ్యవారి బొమ్మ గీయబోతే కోతి బొమ్మ వచ్చిందన్నట్లుగా జగన్ ప్రోగ్రాములు భగ్నం చేయబోగా అది కాస్తా ఎదురుతన్నింది. అన్నిటికి మించి జనాన్ని జగన్ నుంచి విడదీయడం అంత వీజీ కాదని పోలీసులకు ప్రభుత్వానికి అర్థమైంది. మొత్తానికి పోలీసులతోనే జగన్ పర్యటనలు సక్సెస్ అవుతున్నాయి అని ప్రజలు అర్థం చేసుకున్నారు . -సిమ్మాదిరప్పన్న -
చంద్రబాబు.. ఇంక మీ డ్రామాలు ఆపండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రైతుల పక్షాన మేము నిలబడితే ఎల్లో మీడియా దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గు ఉండాలి?. చంద్రబాబు.. రైతులకు నిజంగా మీరు మేలు చేస్తే.. మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిన్నటి బంగారుపాళ్యం పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రైతుల విషయమై.. చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.చంద్రబాబు.. మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు, తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, ఈ దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇది నేరమన్నట్టుగా, రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగానూ, అసాంఘిక శక్తులుగానూ, దొంగలుగానూ చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ, మరోవైపు వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లోమీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడ్డం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజానమోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న తేలికతనానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబుగారు మీరు పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి? పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లోమీడియాకు సిగ్గు ఉండాలి?2. 2.2లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట, 76 వేల రైతు కుటుంబాలకు చెందిన సమస్య ఇది. గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపులవద్దా, ఫ్యాక్టరీల ముందు, పండిన పంటను కొనేవాడులేక రైతులు పారబోస్తున్నారు. ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమే. మరి వీళ్లంతా మీ కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా? కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేం రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంచేస్తే, ఆ కార్యక్రమంపై మీరు చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు, రాస్తున్న వెకిలి రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.3. మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు... అంతేకదా చంద్రబాబుగారూ..! అంతేకాదు, అసలు వీరికి ఏ ఒక్కసమస్యాలేదని, అన్ని హామీలూ మీరు తీర్చేశారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం. తమకు ధరలేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం. ఇదేం పద్ధతి, ఇదేం విధానం చంద్రబాబుగారూ..?4. మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే, రైతులు పంటను తెగనమ్ముకోకపోతే, మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయం పక్కనపెడితే, కిలోకు రూ.4లు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? ఫ్యాక్టరీలు కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలైనా ఎందుకు జారీచేశారు? కర్ణాటకలో కిలో రూ.16ల చొప్పున కనీస ధరకు కొనుగోలుచేస్తామని కేంద్ర ప్రభుత్వం, మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారుకాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు?. దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్టు ఓవైపు మీరు అంగీకరిస్తూ, ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎత్తిచూపితే మళ్లీ ఈ దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు?5. వైయస్సార్సీపీ హయాంలో రైతులకు ఏరోజు ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25-29ల ధర వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి? ప్రతి ఏటా మే 10-15తేదీల మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను, ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదు? ఒక నెలరోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవికూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబుగారూ మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఒకేసారి సరుకు వచ్చేలా చేయడంద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కాదా? మీ గల్లా ఫ్యాక్టరీకి, మీ శ్రీని ఫుడ్స్‌కు… ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడంలేదంటారా? మీరు ఇస్తానన్న రూ.4లు ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8ల చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? ఇదికూడా నిరుడు సంవత్సరం వైయస్సార్సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29ల రేటు, ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రూ.2.5/3లు కేజీకి. దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్షనేతగా, రైతుల పక్షాన నిన్న బంగారుపాళ్యంలో నేను చేస్తే, మీ దగ్గర సమాధానాలు లేక రైతులు మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?6. చంద్రబాబుగారూ.. మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి… ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే, డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చిరైతులకు ధరలు రావడంలేదని గగ్గోలు పెడితే, కేంద్రంచేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టారా? టొబాకో రైతులు ఆందోళన చేస్తే, ఇంకో డ్రామా చేస్తూ, ప్రకటనలు చేయిస్తున్నారు. చిత్తశుద్ధితో మీరు వ్యవహరించారా?7. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కాక ఇతర పంటల కొనుగోలు విషయంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పనిచేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే దానిపై ఆర్బీకేల్లో రియల్ టైం మానిటరింగ్ చేసే CM APP ఏమైంది?8. గత ఏడాది మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20వేలు ఇవ్వలేదు, జూన్ 21 ఇస్తానని చెప్పి, జులై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ, ఈ ఏడాదికూడా దాని గురించి ప్రస్తావించడంలేదు. సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్యగోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.9. వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని గాలికి వదిలేశారు. ఉచిత పంటలబీమాను పూర్తిగా ఎత్తేశారు, ఆర్బీకేలను, ఇ-క్రాప్ విధానాన్ని, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. ఇలా ప్రతిదశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎత్తిచూపితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.1.@ncbn గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా,… pic.twitter.com/9WFD13951r— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025 -
బంగారుపాళ్యంలో పారని పన్నాగం.. జగన్ కోసం మహా 'ప్రభం'జనం (చిత్రాలు)
-
2 వేలమంది పోలీసులతో జగన్ పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయిన చంద్రబాబు
-
జగన్ రోడ్డు మీదకు వచ్చాడంటే.. మీకు చుక్కలే
-
మామిడిని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేయాలి: YS జగన్
-
బంగారుపాళ్యం వీధుల్లో జనసునామీ (ఫొటోలు)
-
జగన్ వచ్చాడంటే ఎలా ఉంటుందో చూసావా.. నీ 2 వేల మంది పోలీసులు..
-
పోలీసుల్లారా.. చంద్రబాబు రేపు మిమ్మల్ని మోసం చేయొచ్చు
సాక్షి,చిత్తూరు: బంగారుపాళ్యంలో ఇవాళ పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులను ఏదో రౌడీ షీటర్లుగా వ్యవహరిస్తూ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులపై మండిపడ్డారాయన.‘రైతుల తలలు పగలకొడతారా? 1,200 మందిని జైల్లో పెడతారా?. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా?. కూటమి ప్రలోభాలు,లంచాలకు పోలీసులు లొంగొద్దు. రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేయొచ్చు. అప్పుడు కూడా నేనే మీ తరుఫున పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి.. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదుప్రతి పోలీసు అధికారికీ ఒకటే చెబుతున్నా. అయ్యా ప్రతి పోలీస్ సోదరుడా.. మీకు కూడా సమస్యలుంటాయి. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా.. పలికేది ఒక్క జగన్ మాత్రమే. పొగాకు రైతులకు సమస్య అయినా జగనే పలుకుతున్నాడు. మామిడి రైతుల సమస్యల పైనా జగనే పలుకుతున్నాడు. మిర్చి రైతులైనా జగనే పలుకుతున్నాడు. ఉద్యోగుల సమస్యలైనా.. వాళ్లకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలన్నా, వేతనాల సవరణ (పీఆర్సీ) డిమాండ్ చేయాలన్నా, వాళ్లకు కరవు భత్యం (డీఏ) ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబునాయుడు హామీలను నిలదీస్తూ, ఆయన్ను గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ సిక్సు, సూపర్ సెవెన్లు అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని ఎండగట్టాలన్నా.. జగన్ మాత్రమే ముందుంటాడు. ప్రతి పోలీస్ సోదరుడు దీన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను.అధికారంలో ఉన్న ఆ ఎస్పీలు, డీఐజీలు, సీఐలు వీళ్ల మాటలు వినకండి. వీళ్ల ప్రలోభాలకు లొంగకండి. రేప్పొద్దున మీ సమస్యలపైనా ఇదే మాదిరిగానే చంద్రబాబు మిమ్మల్ని మోసం చేసి రోడ్డున పడేస్తే.. అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు వస్తాడు. లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవడూ ఉండడు. అసలు సమస్యలే లేనట్లు వక్రీకరిస్తారు. డ్రామాలాడతారు. తప్పుదోవ పట్టిస్తారు. అలా సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి వస్తుంది. ఇంకా అందరూ నష్టపోయే కార్యక్రమం కూడా జరుగుతుందని ప్రతి పోలీస్ సోదరుడికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు రాబోయేది జగన్ ప్రభుత్వం. గుర్తుంచుకోండి’’ అని హితబోధ చేశారాయన. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్లో మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారాయన. -
బాబు కుంభకర్ణుడి నిద్ర లేపడానికే వేల మంది రైతులు వచ్చారు
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్.. పోలీసులపై వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అభిమానులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్, లాఠీచార్జ్‌పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వైఎస్సార్సీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అతడి తలకు బలమైన గాయమై.. రక్తస్రావం జరిగింది. ఈ విషయం తెలిసి.. బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కొట్టారని కారు దిగేందుకు వైఎస్ జగన్‌కు తెలియడంతో కారును ఆపారు. లాఠీచార్జ్‌లో గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకుని ఓవరాక్షన్ చేశారు. వైఎస్ జగన్ కారు దిగకుండా.. అక్కడి నుంచి పంపించేశారు.దీంతో, చిత్తూరు పోలీసులపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌పై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. గాయపడిన పార్టీ నేతను పరామర్శించనివ్వరా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు. మరోవైపు.. బంగారుపాళ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు చేస్తూ.. వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్నారు. హెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా పోలీసులు ఆపేశారు. వైఎస్సార్సీపీ నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేశారు. హైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. -
జగనన్న పలకరింపు.. ఆనందంతో మురిసిపోయిన చిన్నారి
సాక్షి, బంగారుపాళ్యం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా మరోసారి అభిమాన సంద్రం ఎగిసిపడింది. అయితే ఓ చిన్నారి తన బామ్మ కలిసి.. వైఎస్ జగన్‌ను కలిసేందుకు కాన్వాయ్ వద్దకు వచ్చింది.బంగారుపాళ్యం వెళ్తున్న వైఎస్ జగన్‌కు కలిసేందుకు చిత్తూరుకు చెందిన హోమ శైలుషా (7th తరగతి) కాన్వాయ్ వద్దకు వచ్చింది. అనంతరం, వైఎస్ జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించింది. చిన్నారిని చూసిన వైఎస్ జగన్.. కాన్వాయ్ ఆపి మరీ.. చిన్నారి, బామ్మను పలకరించారు. దీంతో, వారిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పట్ల వారికున్న ప్రేమ, అభిమానం చూపించారు. జగన్ మామను కలిసిన ఆనందంలో చిన్నారి తెగ మురిసిపోయింది. ఇప్పడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. People's Leader🤍#YSJagan #YSJaganForPeople #JaganaitheneChesthadu #AndhraPradesh pic.twitter.com/QFppxeE15F— Jaganaithene Chesthadu (@Jaganaithene) July 9, 2025 -
ప్లాన్ ప్రకారమే ప్రసన్న ఇంటిపై దాడి.. డైవర్షన్‌తో చిత్తూరుపై కుట్రలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో దాడి జరగడమేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ మూకల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి.ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడుగారు ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇది. చంద్రబాబుగారి హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి’ అని అన్నారు. .@ncbn గారి దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన… pic.twitter.com/arTHH9lwhE— YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2025 -
రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా : వైఎస్ జగన్
సాక్షి,చిత్తూరు: కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారుమామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చాను. జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ ఆంక్షలు? అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారు.ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదువరికి కూడా ధర లేదు. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారు. వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు.ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా?. ఈ ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న. ఎందుకు ధర లేదు? ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారు.కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం?చంద్రబాబు ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న.. ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి.దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు.నిజంగా ఆ ధరకు ఎంత పంట కొన్నారు?కానీ, ఈ ప్రభుత్వం కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారు. మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయింది. అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారు.ఇక్కడ 76 వేల మంది రైతులు మామిడి సాగుమీద బతుకున్నారు. 6.45 లక్షల టన్నుల పంట పండింది. ఇక్కడ 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు.నాడు కిలో రూ.29. మరి నేడు?మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు. ఇంకా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.ప్రభుత్వమే కొనుగోలు చేయాలిఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి.లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక.అసలు మీరు మనుషులేనా?ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోంది? దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా?. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్ ముందు ఉంటున్నాడు.వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఇది గుర్తు పెట్టుకొండి’అని ముగించారుమార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్‌బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డుకు చేరుకున్న వైఎస్ జగన్‌మామిడి రైతుల సమస్యలను తెలుసుకోనున్న వైఎస్ జగన్‌జనసందోహంగా మారిన మార్కెట్ యార్డ్. పోలీసుల వలయం దాటుకుని మార్కెట్ యార్డుకు రైతులు తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు రైతులు తరలివచ్చారు. వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చారు. మామిడి రైతుల ఆవేదనమామిడి మార్కెట్ యార్డ్‌కు రాకుండా 25 చెక్‌పోస్టులు పెట్టారు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.అడ్డదారుల్లోపరుగులు పెట్టుకుంటూ యార్డుకు వచ్చాం.కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు.ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయ్యింది. వైఎస్ జగన్ పర్యటనపై కూటమి కుట్రలు.. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై ప్రభుత్వం కుట్రలు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నం.వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్.పోలీసుల లాఠీచార్జ్‌లో కార్యకర్తకు గాయాలు.గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లకుండా జగన్‌ను అడ్డుకున్న ఎస్పీ.కాన్వాయ్‌లోని వాహనాలను అడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా వాహనాలు అడ్డగింత.రైతులు కూడా బంగారుపాళ్యం రాకుండా బారికేడ్లు.రైతుల సమస్యలు జగన్‌కు చెప్పుకోకుండా చేయాలని కుట్ర. చిత్తూరు జిల్లా పోలీసుల ఓవరాక్షన్అడుగడుగునా పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలుహెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా పోలీసులు, చెక్ పోస్టులుచివరికి వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్న పోలీసులుఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా ఆపేసిన పోలీసులుYSRCP నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేతహైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయంచిత్తూరు-బెంగుళూరు వైవే మీద ప్రయాణీకులకు ఇబ్బందులుపోలీసులు లాఠీచార్జ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్త తలకు గాయం.వెంటనే ఆసుప్రతికి తరలించిన వైఎస్సార్సీపీ శ్రేణులు. వైఎస్ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం: రైతులుజగన్ మా దగ్గరికి వస్తే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.వైఎస్ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం.జగన్ పాలనలో మాకు గిట్టుబాటు ధర వచ్చింది. యార్డుకు వచ్చిన రైతులు..వైఎస్ జగన్ కోసం భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలుపోలీసులు చెక్‌పోస్టులు పెట్టినప్పటికీ రైతులు యార్డ్‌కు చేరుకున్నారు. వైఎస్ జగన్ కోసమే యార్డ్‌కు వచ్చినట్టు పలువురు కార్యకర్తలు, ప్రజలు తెలిపారు వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకుండా రైతులకు ఆటంకాలు.సమీప ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు.ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్‌పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు తరలివచ్చిన రైతులు. బంగారుపాళ్యం చేరుకున్న వైఎస్ జగన్ కాసేపట్లో మార్కెట్ యార్డ్‌కు వైఎస్ జగన్‌కూటమి సర్కార్ కుట్రలు, పోలీసులను చేధించిన రైతులుమామిడి మార్కెట్‌కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు, ప్రజలువైఎస్ జగన్ కోసం తరలిన అభిమానులు..వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలుఅడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులువైఎస్ జగన్ పర్యటనకు వచ్చేవారి వాహనాలు సీజ్ చేసి, చార్జ్‌షీట్ ఓపెన్ చేస్తామంటూ పోలీసుల బెదిరింపులుఅయినా తగ్గిన అభిమానులునడుచుకుంటూ వైఎస్ జగన్‌ని చూడటానికి వెళ్తున్న ప్రజలుబంగారుపాళ్యం వచ్చే రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటువైఎస్సార్‌సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదం.కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్. బంగారుపాళ్యం బయలుదేరిన వైఎస్ జగన్‌కాసేపట్లో మామిడి మార్కెట్ యార్డ్‌కు వైఎస్ జగన్‌గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్న రైతులు మామిడి రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్ చెక్‌పోస్టుల ఏర్పాటు.. తిరుపతి, కర్ణాటక ప్రధాన రహదారి నాలుగు ప్రాంతాలలో చెక్ పోస్ట్ ఏర్పాటుకర్వేటినగరం, చిత్తూరు మార్గమధ్యంలో రెండు చోట్ల చెక్‌పోస్టులుకొత్తపల్లి మిట్ట, గంగాధర నెల్లూరులో రెండు చెక్ పోస్టులు ఏర్పాటువాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.వైఎస్ జగన్ పర్యటన వచ్చే వాహనాలను సీజ్ చేస్తామంటున్న పోలీసులుఉదయం నుండి వాహనాలలో వస్తున్న అభిమానులు, పార్టీ నాయకులుప్రధాన నాయకులను అనుమతించి, ఇతర నాయకులను దింపేస్తున్న పోలీసులుభారీగా పోలీసుల మోహరింపువైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వ కుట్రలుబంగారుపాళ్యం మామిడి యార్డును ఖాళీ చేయించిన అధికారులురైతులను రానివ్వకుండా యార్డుకు తాళాలురైతులను జగన్ పర్యటనలో పాల్గొననీయకుండా అడుగడుగునా ఆటంకాలుసమీప గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపుఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్న పోలీసులుప్రభుత్వ చర్యలపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహంపోలీసుల ఓవరాక్షన్‌బంగారుపాళ్యం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల ఓవరాక్షన్‌వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే రైతులు, నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులువాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులుకూటమి ప్రభుత్వం, పోలీసుల వ్యవస్థతో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని రైతుల ఆగ్రహంటోల్ గేట్ వద్దకు చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామినారాయణ స్వామి కామెంట్స్..జగన్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుందివైఎస్ జగన్ అంటే కూటమి ప్రభుత్వానికి భయం.అందుకే అడుగడుగునా అడ్డుకుంటున్నారుచిత్తూరు జిల్లా బంగారుపాళ్యం రహదారుల్లో అడుగడుగునా ఆంక్షలుపోలీసులు ఆంక్షలు..బంగారుపాళ్యంలో ఆటంకాలు సృష్టిస్తున్న పోలీసులుబంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వి.కోట మండలం కారకుంట వద్ద పోలీసుల తనిఖీలు, వీడియో రికార్డుబైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలుబంగారుపాళ్యం మండలం మిట్టపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు, వీడియో రికార్డింగ్ చేసిన తర్వాతనే అనుమతి చిత్తూరు..వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం జరుగుతోంది.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్‌ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్ జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు.ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు.వైఎస్ జగన్ పర్యటన ఇలా... వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరుతారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు. -
ఈనెల 9న చిత్తూరు జిల్లాలో YS జగన్ పర్యటన: పెద్దిరెడ్డి
-
ప్రేమ పేరుతో మోసం.. రెండోసారి గర్భం దాల్చడంతో పెళ్లి.. ఆపై
చిత్తూరు కార్పొరేషన్: తొలుత ప్రేమపేరుతో తల్లిని చేసి తర్వాత పెళ్లిపేరుతో నాటకమాడి పరారయ్యాడని దళితయువతి మౌనిక (21) కన్నీటిపర్యంతమైంది. చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూతలపట్టు మండలం మద్దలయ్యగారిపల్లె దళితవాడకు చెందిన మౌనిక ఏడాది కిందట బంగారుపాళ్యంలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు బంగారుపాళ్యం మండలం వెలుతురుచేనుకు చెందిన వినోద్ పరిచయమయ్యాడు. ప్రేమపేరుతో కలిసి తిరిగారు. మౌనిక గర్భం దాల్చడంతో వినోద్ మాత్రలు ఇచ్చి అబార్షన్ చేయించాడు. మళ్లీ రెండోసారి గర్భం దాల్చడంతో వీరి ప్రేమ వ్యవహారం బాధితురాలి ఇంట్లో తెలిసింది. వారి కుటుంబసభ్యులు నిలదీయగా ఈ ఏప్రిల్ 17వ తేదీన బంగారుపాళ్యం మండలం నలగలంపల్లె వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. వారం పాటు మౌనిక ఇంటికొచ్చి ఉండి.. తర్వాత పనికి వెళ్తానని చెప్పి వినోద్ పరారయ్యాడు. ఈ క్రమంలో మౌనిక జూన్ 4వ తేదీన ఓ పాపకు జన్మనిచ్చింది. బిడ్డతో వినోద్ ఇంటికి వెళ్తే.. అత్తామామలు రానివ్వలేదు. దీంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని బాధితురాలు వాపోయింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది. -
చిన్నారిపై అత్యాచారం.. హత్య
బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్యచేశాడు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లె సమీపంలోని కోళ్లపారంలో కుమార్, బుజ్జమ్మ దంపతులకు అమ్ములు(5) అనే కుమార్తె ఉంది. గురువారం రాత్రి తమకు పరిచయస్తుడైన మునుస్వామితో కలసి వారంతా సినిమాకు వెళ్లారు. తిరిగి వస్తూ దారిలో ముగ్గురూ మద్యం తాగారు. ఇంటికి చేరుకున్న తర్వాత కుమార్ దంపతులు తమ నివాసంలో నిద్రించారు. శుక్రవారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి అమ్ములు సమీపంలో విగతజీవిగా పడి ఉంది. మునుస్వామి కనిపించకుండా పోయాడు. అమ్ములుపై అత్యాచారం చేసిన ఆనవాళ్లు కనిపించడంతో మునిస్వామి ఈ అఘాయిత్యం చేసి చంపేసి ఉంటాడని వారు భావిస్తున్నారు. ఈమేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.