
సాక్షి, బంగారుపాళ్యం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా మరోసారి అభిమాన సంద్రం ఎగిసిపడింది. అయితే ఓ చిన్నారి తన బామ్మ కలిసి.. వైఎస్ జగన్‌ను కలిసేందుకు కాన్వాయ్ వద్దకు వచ్చింది.


బంగారుపాళ్యం వెళ్తున్న వైఎస్ జగన్‌కు కలిసేందుకు చిత్తూరుకు చెందిన హోమ శైలుషా (7th తరగతి) కాన్వాయ్ వద్దకు వచ్చింది. అనంతరం, వైఎస్ జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించింది. చిన్నారిని చూసిన వైఎస్ జగన్.. కాన్వాయ్ ఆపి మరీ.. చిన్నారి, బామ్మను పలకరించారు. దీంతో, వారిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పట్ల వారికున్న ప్రేమ, అభిమానం చూపించారు. జగన్ మామను కలిసిన ఆనందంలో చిన్నారి తెగ మురిసిపోయింది. ఇప్పడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

People's Leader🤍#YSJagan #YSJaganForPeople #JaganaitheneChesthadu #AndhraPradesh pic.twitter.com/QFppxeE15F
— Jaganaithene Chesthadu (@Jaganaithene) July 9, 2025