
సాక్షి,చిత్తూరు: కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు
మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారు
మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చాను. జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ ఆంక్షలు? అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారు.
ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు
వరికి కూడా ధర లేదు. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారు. వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు.ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా?. ఈ ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న. ఎందుకు ధర లేదు? ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారు.
కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం?
చంద్రబాబు ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న.. ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి.దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు.
నిజంగా ఆ ధరకు ఎంత పంట కొన్నారు?
కానీ, ఈ ప్రభుత్వం కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారు. మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయింది. అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారు.ఇక్కడ 76 వేల మంది రైతులు మామిడి సాగుమీద బతుకున్నారు. 6.45 లక్షల టన్నుల పంట పండింది. ఇక్కడ 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు.
నాడు కిలో రూ.29. మరి నేడు?
మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు. ఇంకా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి.
లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక.
అసలు మీరు మనుషులేనా?
ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోంది? దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా?. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్ ముందు ఉంటున్నాడు.వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఇది గుర్తు పెట్టుకొండి’అని ముగించారు
మార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్
బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డుకు చేరుకున్న వైఎస్ జగన్
మామిడి రైతుల సమస్యలను తెలుసుకోనున్న వైఎస్ జగన్
జనసందోహంగా మారిన మార్కెట్ యార్డ్.
పోలీసుల వలయం దాటుకుని మార్కెట్ యార్డుకు రైతులు తరలివచ్చారు.
తమ సమస్యలు చెప్పుకొనేందుకు రైతులు తరలివచ్చారు.
వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చారు.
మామిడి రైతుల ఆవేదన
మామిడి మార్కెట్ యార్డ్‌కు రాకుండా 25 చెక్‌పోస్టులు పెట్టారు.
బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.
అడ్డదారుల్లోపరుగులు పెట్టుకుంటూ యార్డుకు వచ్చాం.
కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు.
ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయ్యింది.
వైఎస్ జగన్ పర్యటనపై కూటమి కుట్రలు..
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై ప్రభుత్వం కుట్రలు.
వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నం.
వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్.
పోలీసుల లాఠీచార్జ్‌లో కార్యకర్తకు గాయాలు.
గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లకుండా జగన్‌ను అడ్డుకున్న ఎస్పీ.
కాన్వాయ్‌లోని వాహనాలను అడ్డుకున్న పోలీసులు
మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా వాహనాలు అడ్డగింత.
రైతులు కూడా బంగారుపాళ్యం రాకుండా బారికేడ్లు.
రైతుల సమస్యలు జగన్‌కు చెప్పుకోకుండా చేయాలని కుట్ర.
చిత్తూరు జిల్లా పోలీసుల ఓవరాక్షన్
అడుగడుగునా పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు
హెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా పోలీసులు, చెక్ పోస్టులు
చివరికి వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్న పోలీసులు
ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా ఆపేసిన పోలీసులు
YSRCP నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేత
హైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం
చిత్తూరు-బెంగుళూరు వైవే మీద ప్రయాణీకులకు ఇబ్బందులు
పోలీసులు లాఠీచార్జ్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్త తలకు గాయం.
వెంటనే ఆసుప్రతికి తరలించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
వైఎస్ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం: రైతులు
జగన్ మా దగ్గరికి వస్తే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు.
బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.
ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.
వైఎస్ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం.
జగన్ పాలనలో మాకు గిట్టుబాటు ధర వచ్చింది.
యార్డుకు వచ్చిన రైతులు..
వైఎస్ జగన్ కోసం భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు
పోలీసులు చెక్‌పోస్టులు పెట్టినప్పటికీ రైతులు యార్డ్‌కు చేరుకున్నారు.
వైఎస్ జగన్ కోసమే యార్డ్‌కు వచ్చినట్టు పలువురు కార్యకర్తలు, ప్రజలు తెలిపారు
వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకుండా రైతులకు ఆటంకాలు.
సమీప ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు.
ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్
పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు తరలివచ్చిన రైతులు.
బంగారుపాళ్యం చేరుకున్న వైఎస్ జగన్
కాసేపట్లో మార్కెట్ యార్డ్‌కు వైఎస్ జగన్
కూటమి సర్కార్ కుట్రలు, పోలీసులను చేధించిన రైతులు
మామిడి మార్కెట్‌కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు, ప్రజలు
వైఎస్ జగన్ కోసం తరలిన అభిమానులు..
వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు
అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు
వైఎస్ జగన్ పర్యటనకు వచ్చేవారి వాహనాలు సీజ్ చేసి, చార్జ్‌షీట్ ఓపెన్ చేస్తామంటూ పోలీసుల బెదిరింపులు
అయినా తగ్గిన అభిమానులు
నడుచుకుంటూ వైఎస్ జగన్‌ని చూడటానికి వెళ్తున్న ప్రజలు
బంగారుపాళ్యం వచ్చే రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటు
వైఎస్సార్‌సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదం.
కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్.
బంగారుపాళ్యం బయలుదేరిన వైఎస్ జగన్
కాసేపట్లో మామిడి మార్కెట్ యార్డ్‌కు వైఎస్ జగన్
గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్న రైతులు
మామిడి రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్
చెక్‌పోస్టుల ఏర్పాటు..
తిరుపతి, కర్ణాటక ప్రధాన రహదారి నాలుగు ప్రాంతాలలో చెక్ పోస్ట్ ఏర్పాటు
కర్వేటినగరం, చిత్తూరు మార్గమధ్యంలో రెండు చోట్ల చెక్‌పోస్టులు
కొత్తపల్లి మిట్ట, గంగాధర నెల్లూరులో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.
వైఎస్ జగన్ పర్యటన వచ్చే వాహనాలను సీజ్ చేస్తామంటున్న పోలీసులు
ఉదయం నుండి వాహనాలలో వస్తున్న అభిమానులు, పార్టీ నాయకులు
ప్రధాన నాయకులను అనుమతించి, ఇతర నాయకులను దింపేస్తున్న పోలీసులు
భారీగా పోలీసుల మోహరింపు
వైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వ కుట్రలు
బంగారుపాళ్యం మామిడి యార్డును ఖాళీ చేయించిన అధికారులు
రైతులను రానివ్వకుండా యార్డుకు తాళాలు
రైతులను జగన్ పర్యటనలో పాల్గొననీయకుండా అడుగడుగునా ఆటంకాలు
సమీప గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు
ఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్న పోలీసులు
ప్రభుత్వ చర్యలపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం
పోలీసుల ఓవరాక్షన్
బంగారుపాళ్యం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల ఓవరాక్షన్
వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే రైతులు, నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
వాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులు
కూటమి ప్రభుత్వం, పోలీసుల వ్యవస్థతో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని రైతుల ఆగ్రహం
టోల్ గేట్ వద్దకు చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
నారాయణ స్వామి కామెంట్స్..
జగన్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుంది
వైఎస్ జగన్ అంటే కూటమి ప్రభుత్వానికి భయం.
అందుకే అడుగడుగునా అడ్డుకుంటున్నారు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం రహదారుల్లో అడుగడుగునా ఆంక్షలు
పోలీసులు ఆంక్షలు..
బంగారుపాళ్యంలో ఆటంకాలు సృష్టిస్తున్న పోలీసులు
బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వి.కోట మండలం కారకుంట వద్ద పోలీసుల తనిఖీలు, వీడియో రికార్డు
బైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు
బంగారుపాళ్యం మండలం మిట్టపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు, వీడియో రికార్డింగ్ చేసిన తర్వాతనే అనుమతి
చిత్తూరు..
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం జరుగుతోంది.
కూటమి నేతల బెదిరింపులు...
దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్‌ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.

ఎన్ని ఆటంకాలు సృష్టించినా...
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్ జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు.
ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్‌సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు.
వైఎస్ జగన్ పర్యటన ఇలా...
వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరుతారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.