breaking news
Sarah Taylor
-
నా భాగస్వామి తల్లి కాబోతుంది: స్టార్ మహిళా క్రికెటర్
స్టార్ మహిళా క్రికెటర్, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ సారా టేలర్.. సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. 2019లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సారా.. తాను తల్లిని కాబోతున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 22) ప్రకటించింది. స్వలింగ సంపర్కురాలైన సారా.. చాలా కాలంగా డయానా అనే మహిళతో సహజీవనం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా కన్ఫర్మ్ చేసిన సారా తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sarah Taylor (@sjtaylor30) తమ జీవన ప్రయాణం సాఫీగా సాగలేదు. తల్లి కావాలన్నది తన భాగస్వామి కల. ఈ విషయంలో డయానా ఎక్కడా రాజీ పడలేదు. నాకు తెలుసు డయానా మంచి తల్లి అవుతుంది. ఇందులో భాగమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా 19 వారాలు గడవాలి. జీవితం చాలా కొత్తగా ఉండబోతుంది. డయానా పట్ల చాలా గర్వంగా ఉన్నానంటూ రాసుకొచ్చింది. డయానా ఈ విషయాన్ని బహిర్గతం చేసాక సహచరులు, మిత్రులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Being a mother has always been my partner's dream. The journey hasn't been an easy one but Diana has never given up. I know she will be the best mum and I'm so happy to be a part of it x19 weeks to go and life will be very different ! 🤍🌈 pic.twitter.com/9bvwK1Yf1e— Sarah Taylor (@Sarah_Taylor30) February 21, 2023 ఇదిలా ఉంటే, ఒత్తిడి సంబంధిత సమస్యల కారణంగా సారా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. కెరీర్లో 10 టెస్ట్‌లు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడిన సారా.. 300 టెస్ట్ పరుగులు, 4056 వన్డే పరుగులు, 2177 టీ20 పరుగులు సాధించింది. వన్డేల్లో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు చేసిన ఆమె.. టీ20ల్లో 16 అర్ధశతకాలు బాదింది. వికెట్‌కీపర్‌గా టెస్ట్‌ల్లో 18 క్యాచ్‌లు, 2 స్టంపౌట్లు.. వన్డేల్లో 87 క్యాచ్‌లు, 51 స్టంపౌట్లు.. టీ20ల్లో 23 క్యాచ్‌లు, 51 స్టంపౌట్లు చేసిన 33 ఏళ్ల సారా.. 2017లో ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. 2021లో టీమ్ అబుదాబీ (టీ10 లీగ్) అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైన సారా.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఎంపికైన తొలి మహిళా కోచ్‌గా చరిత్ర సృష్టించింది. -
క్రికెట్ చరిత్రలో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్
Sarah Taylor Becomes First Woman Coach In Mens team: క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి టీమ్ అబుదాబి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు మహిళా క్రికెటర్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజీ తెలిపింది. అబుదాబీ టీ10 లీగ్‌లో మాజీ ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ట్విటర్లో వెల్లడించింది. దీంతో మెన్స్ ఫ్రాంఛైజీ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ సారా టేలర్ చరిత్ర సృష్టించింది. కాగా ఇంతకుముందు ఇంగ్లండ్ మెన్స్ కౌంటీ టీమ్ ససెక్స్ జట్టుకి స్పెషలిస్ట్ కోచ్(వికెట్ కీపింగ్ కోచ్)గా నూ సారా టేలర్ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇక ఇంగ్లండ్ సాధించిన రెండు వన్డే వరల్డ్ కప్‌లు, ఒక టీ20 వరల్డ్ కప్ జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. కాగా నవంబర్ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్ ప్రారంభం కానుంది. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: భేష్.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్