నా భాగస్వామి తల్లి కాబోతుంది: స్టార్‌ మహిళా క్రికెటర్‌

Former England Women Cricketer Sarah Taylor Announces Partner Dianas Pregnancy - Sakshi

స్టార్‌ మహిళా క్రికెటర్‌, ఇంగ్లండ్‌ మాజీ ప్లేయర్‌ సారా టేలర్‌.. సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ చేసి వార్తల్లో నిలిచింది. 2019లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సారా.. తాను తల్లిని కాబోతున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 22) ప్రకటించింది. స్వలింగ సంపర్కురాలైన సారా.. చాలా కాలంగా డయానా అనే మహిళతో సహజీవనం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రెగ్నెన్సీ కిట్‌ ద్వారా కన్ఫర్మ్‌ చేసిన సారా తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది.

తమ జీవన ప్రయాణం సాఫీగా సాగలేదు. తల్లి కావాలన్నది తన భాగస్వామి కల. ఈ విషయంలో డయానా ఎక్కడా రాజీ పడలేదు. నాకు తెలుసు డయానా మంచి తల్లి అవుతుంది. ఇందులో భాగమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా 19 వారాలు గడవాలి. జీవితం చాలా కొత్తగా ఉండబోతుంది. డయానా పట్ల చాలా గర్వంగా ఉన్నానం‍టూ రాసుకొచ్చింది. డయానా ఈ విషయాన్ని బహిర్గతం చేసాక సహచరులు, మిత్రులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదిలా ఉంటే, ఒత్తిడి సంబంధిత సమస్యల కారణంగా సారా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. కెరీర్‌లో 10 టెస్ట్‌లు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడిన సారా.. 300 టెస్ట్‌ పరుగులు, 4056 వన్డే పరుగులు, 2177 టీ20 పరుగులు సాధించింది. వన్డేల్లో 7 సెంచరీలు, 20 హాఫ్‌ సెంచరీలు చేసిన ఆమె.. టీ20ల్లో 16 అర్ధశతకాలు బాదింది.

వికెట్‌కీపర్‌గా టెస్ట్‌ల్లో 18 క్యాచ్‌లు, 2 స్టంపౌట్‌లు.. వన్డేల్లో 87 క్యాచ్‌లు, 51 స్టంపౌట్‌లు.. టీ20ల్లో 23 క్యాచ్‌లు, 51 స్టంపౌట్‌లు చేసిన 33 ఏళ్ల సారా.. 2017లో ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. 2021లో టీమ్‌ అబుదాబీ (టీ10 లీగ్‌) అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపికైన సారా.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఎంపికైన తొలి మహిళా కోచ్‌గా చరిత్ర సృష్టించింది.      

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top