ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు.. | Sarita Yolmo became the first woman TTE Of Darjeeling Himalayan Railway | Sakshi
Sakshi News home page

ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు..

Feb 18 2026 3:26 PM | Updated on Feb 18 2026 3:46 PM

Sarita Yolmo became the first woman TTE Of Darjeeling Himalayan Railway

నూట నలభై ఆరు సంవత్సరాల డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే (డీహెచ్‌ఆర్‌) చరిత్రలో తొలి మహిళా టికెట్‌ కలెక్టర్‌ (టీసి)గా సరితా యోల్మో చరిత్ర సృష్టించింది.  ప్లస్‌ టు పూర్తి చేసిన తరువాత ఉద్యోగం రావడంతో పై చదువులు చదువుకోలేకపోయింది సరిత. ఆమె భర్త దవా యోల్మో కూడా రైల్వేలో పనిచేసేవారు. ఆయన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌గా రిటైర్‌ అయ్యారు.
‘సరిత అంకితభావం ఉన్న ఉద్యోగి మాత్రమే కాదు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధులను ఎలా సమన్వయం చేసుకోవాలో బాగా తెలిసిన మహిళ. డీహెచ్‌ఆర్‌లో ఫస్ట్‌ ఉమెన్‌ ట్రైయిన్‌ టికెట్‌ కలెక్టర్‌గా సరితను చూడడం గర్వంగా ఉంది’ అంటున్నాడు దవా యోల్మో.

న్యూ జల్పైగురి నుండి నడిచే బ్రాడ్‌–గేజ్‌ రైళ్లలోటికెట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది సరిత.
‘డీహెచ్‌ఆర్‌లో టీసిగా నియామకం కావడం చాలా సంతోషంగా ఉంది. అయితే కొంత భయం కూడా ఉంది. న్యూ జల్పైగురి, డార్టిలింగ్‌ల మధ్య పది గంటల ప్రయాణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం నా ఉద్యోగ జీవితంలో కొత్త ఎపిసోడ్‌’ అంటుంది సరిత.
టికెట్‌ కలెక్టర్‌ యూనిఫామ్‌లో ఉన్న సరితను ఆసక్తికరంగా చూస్తుంటారు ప్రయాణికులు. కొందరు ఆమెతో సెల్ఫీలు తీసుకుంటారు.

‘కుర్సియాంగ్‌లోని రైల్వే ప్రెస్‌లో పనిచేయడం నాకు సంతోషంగా ఉండేది. అయితే ఆ ప్రెస్‌ మూసివేయడంతో విధి నాకు వేరే దారి చూపింది. న్యూ జల్పైగురికి బదిలీ కావడంతో కొత్త సవాళ్లను స్వీకరించాల్సి వచ్చింది. నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వేలోని వాణిజ్య విభాగంలో చేరకపోతే, నాకు కొత్త అవకాశాలు వచ్చేవి కావు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంది సరిత.

 

(చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement