
గుజరాత్ వడోదరాలో బుధవారం గాంభీరా వంతెన కుప్పకూలడంతో మహిసాగర్ నదిలో వాహనాలు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 16 మంది మృతి చెందారు. వంతెన స్థితి అధ్వానంగా ఉందని 2021 నుంచి స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. వాహనాలను అనుమతించ వద్దని కోరినా పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



















