T20 World Cup 2021 Pak Vs Afg: Pak PM Imran Khan Praises Afghanistan Team Goes Viral - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 Pak Vs Afg: భేష్‌.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్‌ ఖాన్‌

Oct 30 2021 11:34 AM | Updated on Oct 30 2021 12:21 PM

T20 World Cup 2021 Pak Vs Afg: Imran Khan Praises Afghanistan Team - Sakshi

Pakistan PM Comments On Afghan Team: అఫ్గనిస్తాన్‌ జట్టుపై ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రశంసల జల్లు

Imran Khan Says I have never seen a cricketing nation rise as rapidly as Afghanistan: టీ20 ప్రపంచప్‌-2021 టోర్నీ సూపర్‌-12 రౌండ్‌కు నేరుగా అర్హత సాధించి సత్తా చాటింది అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు. ఈ మెగా ఈవెంట్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్వాలిఫైయర్స్‌ ఆడగా .. అఫ్గన్‌ మాత్రం డైరెక్ట్‌గా టీమిండియా, పాకిస్తాన్‌తో కలిసి గ్రూపు-2లో చేరింది. తద్వారా తమను పసికూనలుగా భావించవద్దనే గట్టి సంకేతాలు ఇచ్చింది.

ఇక మొదటి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 130 పరుగుల తేడాతో విజయం సాధించి ఘనంగా టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించింది. తాలిబన్ల పాలనలో సతమతవుతున్న ప్రజలకు కాస్త ఊరటనిచ్చేలా..  ప్రపంచ వేదికపై అద్వితీయమైన గెలుపును అందుకుంది.

అదే విధంగా... అక్టోబరు 29న పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ బాబర్‌ ఆజమ్‌ బృందాన్ని ఓడించినంత పని చేసింది. ఆఖర్లో ఆసిఫ్‌ అలీ మెరుపులు మెరిపించకపోయి ఉంటే... సంచలన విజయం అఫ్గన్‌ సొంతమయ్యేది. ఏదేమైనా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓడినప్పటికీ నబీ బృందం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. 

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ అఫ్గనిస్తాన్‌ జట్టుపై ప్రశంసలు కురిపించారు. గత దశాబ్దకాలంగా అఫ్గన్‌ జట్టు ఎదిగిన విధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పాకిస్తాన్‌కు శుభాకాంక్షలు చెబుతూనే... మహ్మద్‌ నబీ టీమ్‌ను కొనియాడారు.

‘‘పాకిస్తాన్‌ జట్టుకు శుభాభినందనలు. అఫ్గనిస్తాన్‌ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంత వేగంగా ఎదిగి... ఈ స్థాయిలో ప్రత్యర్థి జట్లకు సవాల్‌ విసరగలిగే జట్టును నేనింత వరకు చూడలేదు. ఇంతటి ప్రతిభ, పోటీతత్వం కలిగిన అఫ్గనిస్తాన్‌ జట్టుకు ఎంతో మెరుగైన భవిష్యత్తు ఉంది’’ అని ఇమ్రాన్‌ఖాన్‌ ట్వీట్‌ చేశారు. అయితే, ఇందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

చదవండి: T20 World Cup 2021 Final: ఆ పేరు గుర్తుపెట్టుకోండి.. ఫైనల్‌లో ఆ రెండు జట్లే: స్టోక్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement