
మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్ ఓ భామ అయ్యో రామా చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ జూలై 11న రిలీజ్ కానుంది. ఈ మూవీలోని ఓ సీన్‌లో స్విమ్మింగ్ రాకపోయినా నీళ్లలోకి దూకేసింది. తన వల్ల షూటింగ్ వాయిదా పడటం ఇష్టం లేక భయపడుతూనే స్విమ్మింగ్ చేసింది.

ఈమె తమిళంలో నటించిన జో మూవీ హిట్టవడంతో మంచి పాపులారిటీ లభించింది. ఈ బ్యూటీ పదో తరగతి చదువుతున్న సమయంలోనే వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది.



















