
భారత పురుషుల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటన ఖారరైంది. ఈ ఏడాది ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లలో తలపడేందుకు బంగ్లాదేశ్‌కు టీమిండియా వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మంగళవారం విడుదల చేసింది.
ఆగస్టు 17న మిర్పూర్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్ ముగిసిన రెండు వారాలకే భారత జట్టు బంగ్లాకు పయనం కానుంది. ఈ క్రమంలో బంగ్లాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు గైర్హాజరు అయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే బంగ్లాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో గిల్‌తో పాటు జైశ్వాల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్ ఆడే ఛాన్స్ ఉంది. కాగా వీరు ముగ్గురు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడనునున్నారు.
కానీ సెలక్టర్లు మాత్రం బంగ్లా సిరీస్‌కు ఈ త్రయానికి విశ్రాంతి ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బంగ్లాతో టీ20 సిరీస్‌లో మాత్రం ఆడేంచే అవకాశమున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టీ20 ఆసియా కప్-2025 జరగనుండడంతో బంగ్లా సిరీస్‌లో బుమ్రా ఆడడం దాదాపుగా ఖాయం.
బుమ్రా ఇటీవలే గాయం నుంచి కోలుకుని ఐపీఎల్‌లో ఆడుతున్నాడు.మరోవైపు ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్న గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయిసుదర్శన్ తిరిగి వన్డే, టీ20 జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.