చెలరేగిన భారత బౌలర్లు.. 127 పరుగులకే బంగ్లా ఆలౌట్‌ | Arshdeep And Varun 3-fers help India bowl Bangladesh out for 127 | Sakshi
Sakshi News home page

IND vs BAN 1st T20: చెలరేగిన భారత బౌలర్లు.. 127 పరుగులకే బంగ్లా ఆలౌట్‌

Oct 6 2024 8:52 PM | Updated on Oct 6 2024 8:52 PM

Arshdeep And Varun 3-fers help India bowl Bangladesh out for 127

గ్వాలియర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చేరిగారు. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లా జట్టు కేవలం 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.

వీరిద్దరితో పాటు హార్దిక్‌ పాండ్యా, సుందర్‌, మయాంక్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్‌ మెహదీ హసన్‌(35 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్‌ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచాడు. వచ్చినవారు వచ్చినట్టుగానే పెవిలియన్‌కు చేరారు.
చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన మయాంక్‌ యాదవ్‌..

 

Advertisement
 
Advertisement
Advertisement