చరిత్ర సృష్టించిన మయాంక్‌ యాదవ్‌.. | IND Vs BAN 1st T20I: Mayank Yadav Creates HISTORY To Bowl A Maiden In His First Over In T20I Format, Details Inside | Sakshi
Sakshi News home page

IND Vs BAN 1st T20I: చరిత్ర సృష్టించిన మయాంక్‌ యాదవ్‌..

Oct 6 2024 8:37 PM | Updated on Oct 7 2024 10:00 AM

Mayank Yadav Creates HISTORY In Bangladesh vs India 1st T20I

టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మయాంక్.. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

తన ఇంటర్ననేషనల్ కెరీర్‌ను మెయిడెన్ ఓవర్‌తో యాదవ్ ప్రారంభించాడు. బంగ్లా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన మయాంక్‌.. ఎటువంటి పరుగులు ఇవ్వకుండా మెయిడిన్‌గా ముగించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను మెయిడెన్ చేసిన మూడో భారత బౌలర్‌గా ఈ ఢిల్లీ పేస్ సంచలనం రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.

అగార్కర్ 2006లో సౌతాఫ్రికాపై, అర్ష్‌దీప్ 2022లో ఇగ్లండ్‌పై ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్‌.. 21 పరుగులిచ్చి ఓ కీలక వికెట్‌ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement