యువ భారత్‌కు వరుసగా రెండో విజయం
18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి
మెరిసిన వైభవ్, అభిజ్ఞాన్
అండర్–19 ప్రపంచకప్
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై అలవోక విజయం సాధించిన ఆయుశ్ మాత్రే సారథ్యంలోని యువ భారత జట్టు... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో భారత్ 18 పరుగుల తేడాతో (డక్‌వర్త్–లూయీస్ పద్ధతిలో) బంగ్లాదేశ్‌పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7), హర్‌వంశ్ పంగలియా (2) విఫలమైనా... యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (67 బంతుల్లో 72; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిజ్ఞాన్ కుందు (112 బంతుల్లో 80; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఒకవైపు వరుస వికెట్లు పడుతున్నా... వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ చక్కటి పోరాటం కనబర్చారు. ఫలితంగా యంగ్ ఇండియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.
గంటకు పైగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలుత భారత ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహద్ 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మ్యాచ్‌కు మరోసారి వర్షం అడ్డుపడింది. దీంతో బంగ్లా లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165గా నిర్ణయించారు. ఛేదనలో బంగ్లా 28.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ అజీజుల్ హకీమ్ (72 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో పోరాడగా... మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో 106/2తో పటిష్ట స్థితిలో ఉన్న బంగ్లాదేశ్... భారత బౌలర్ల జోరుతో మరో 40 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విహాన్ మల్హోత్రా 4 వికెట్లతో సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్‌లో ఈ నెల 26న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.
స్కోరు వివరాలు
భారత అండర్–19 ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) కలామ్ (బి) ఫహద్ 6; వైభవ్ (సి) ఫహద్ (బి) ఇక్బాల్ 72; వేదాంత్ (సి) రిఫత్ (బి) ఫహద్ 0; విహాన్ (సి) అబ్రార్ (బి) అజీజుల్ 7; అభిజ్ఞాన్ (సి) ఫరీద్ (బి) ఫహద్ 80; హర్‌వంశ్ (సి) రిఫత్ (బి) ఇక్బాల్ 2; కనిష్క్ (సి) (సబ్) అబ్దుల్లా (బి) అజీజుల్ 28; అంబరీష్ (సి) ఫరీద్ (బి) పర్వేజ్ 5; ఖిలాన్ (సి) ఫరీద్ (బి) ఫహద్ 8; హెనిల్ (నాటౌట్) 7; దీపేశ్ (సి) రిజాన్ (బి) ఫహద్ 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 238.
వికెట్ల పతనం: 1–12, 2–12, 3–53, 4–115, 5–119, 6–173, 7–194, 8–208, 9–224, 10–238.
బౌలింగ్: అల్ ఫహద్ 9.2–1–38–5; ఇక్బాల్ 8–1–45–2; పర్వేజ్ 10–1–46–1; అజీజుల్ 10–1–42–2; రిజాన్ 8–0–43–0; సాద్ ఇస్లామ్ 2.2–0–18–0; బషీర్ 1–0–6–0.
బంగ్లాదేశ్ అండర్–19 ఇన్నింగ్స్: జవాద్ అబ్రార్ (సి) హెనిల్ (బి) దీపేశ్ 5; రిఫత్ (సి) అభిజ్ఞాన్ (బి) కనిష్క్ 37; అజీజుల్ (సి) కనిష్క్ (బి) ఖిలాన్ 51; కలామ్ (సి అండ్ బి) విహాన్ 15; పర్వేజ్ (సి) కనిష్క్ (బి) విహాన్ 7; రిజాన్ (సి) హెనిల్ (బి) విహాన్ 15; బషీర్ (సి) వైభవ్ (బి) విహాన్ 2; ఫరీద్ (సి) దీపేశ్ (బి) ఖిలాన్ 1; ఫహద్ (రనౌట్) 0; ఇక్బాల్ (సి) ఆయుశ్ (బి) హెనిల్ 2; ఇస్లామ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (28.3 ఓవర్లలో ఆలౌట్) 146.
వికెట్ల పతనం: 1–6, 2–62, 3–106, 4–124, 5–126, 6–129, 7–138, 8–143, 9–144, 10–146.
బౌలింగ్: దీపేశ్ 4–0–27–1; హెనిల్ 4.3–1–17–1; అంబరీష్ 3–0–18–0; కనిష్క్ 6–0–22–1; ఖిలాన్ 6–0–35–2; ఆయుశ్ 1–0–7–0; విహాన్ 4–0–14–4.


