రియాన్ ప‌రాగ్ ఓవరాక్ష‌న్‌.. షాకిచ్చిన అంపైర్‌(వీడియో) | Riyan Parag Sparks Controversy With Bizarre Action, Umpire Spoils Plan With Rare No-Ball, Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND vs BAN: రియాన్ ప‌రాగ్ ఓవరాక్ష‌న్‌.. షాకిచ్చిన అంపైర్‌(వీడియో)

Oct 10 2024 9:42 AM | Updated on Oct 10 2024 12:03 PM

Riyan Parag Sparks Controversy With Bizarre Action: Umpire Spoils Plan With Rare No-Ball

ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత యువ ఆల్‌రౌండర్‌ రియాన్ పరాగ్ వింత బౌలింగ్‌ యాక్షన్‌తో అందరిని ఆశ్యర్యపరిచాడు. కొత్త బౌలింగ్ యాక్షన్‌ను ప్రయత్నించి నవ్వుల పాలయ్యాడు.

అసలేం జరిగిందంటే?
బంగ్లా ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్ బౌలింగ్‌ చేసేందుకు భార‌త కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌.. పార్ట్ టైమ్ స్పిన్న‌ర్ రియాన్ ప‌రాగ్ చేతికి బంతి అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రియాన్‌ వేసిన మొద‌టి బంతినే బంగ్లా బ్యాట‌ర్ మ‌హ్మ‌దుల్లా భారీ సిక్స‌ర్‌గా మలిచాడు.

తద్వారా ప‌రాగ్ కాస్త నిరాశ‌చెందాడు. ఈ క్ర‌మంలో కొత్తగా ఏదైనా ప్ర‌య‌త్నించి బంగ్లా బ్యాట‌ర్లను ఇబ్బంది పెట్టాల‌నుకున్నాడు.  దీంతో లసిత్ మలింగ స్టైల్‌లో బౌలింగ్ చేయాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ ఓవ‌ర్‌లో నాలుగో బంతిని రియాన్.. మ‌హ్మ‌దుల్లాకు స్లింగ్లింగ్ డెలివ‌రీగా సంధించాడు. అత‌డి బౌలింగ్ యాక్ష‌న్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అత‌డి బౌలింగ్ యాక్ష‌న్‌పై అనుమానం వ‌చ్చిన ఫీల్డ్ అంపైర్ మ‌ధ‌న్ గోపాల్ థ‌ర్డ్ అంపైర్‌ను సంప్ర‌దించాడు. రిప్లేలో బ్యాక్‌ఫుట్ నో బాల్‌గా తేలింది. 

డెలివ‌రీ సంధించే క్ర‌మంలో ప‌రాగ్ బ్యాక్ ఫుట్ ట్రామ్‌లైన్ వెలుపల ఉంది. అందుకునే థ‌ర్డ్ అంపైర్ బ్యాక్‌ఫుట్ నో బాల్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో మ‌హ్మ‌దుల్లాకు ఫ్రీ హిట్ ల‌భించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement