అలా ఎలా కొట్టావు హార్దిక్‌.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో) | Hardik Pandya Oozes Swag With No-Look Ramp Shot Against Bangladesh | Sakshi
Sakshi News home page

IND vs BAN: అలా ఎలా కొట్టావు హార్దిక్‌.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో)

Oct 7 2024 3:35 PM | Updated on Oct 7 2024 4:04 PM

Hardik Pandya Oozes Swag With No-Look Ramp Shot Against Bangladesh

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా విజ‌యంతో ఆరంభించింది. ఆదివారం గ్వాలియ‌ర్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

తొలుత బౌలింగ్‌లో ఓ కీల‌క వికెట్ ప‌డ‌గొట్టిన పాండ్యా.. త‌ర్వాత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 16 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న హార్దిక్‌.. 5 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 39 ప‌రుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అయితే హార్దిక్ ఆడిన‌ ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది.

పాం‍డ్యా నో లుక్ షాట్‌.. 
భారత ఇన్నింగ్స్ 12 ఓవర్‌లో మూడో బంతిని హార్దిక్‌కు బంగ్లా పేసర్ టాస్కిన్ అహ్మద్ షార్ట్ పిచ్ బాల్ డెలివరీగా సంధించేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం తను ఆశించిన మేరకు బౌన్స్ కాలేదు. అయితే ఇక్కడే హార్దిక్ తన యూటిట్యూడ్‌ను చూపించాడు. బంతిని చూడకుండానే నో లుక్ ర్యాంప్ షాట్ ఆడాడు.

ఆడిన తర్వాత కనీసం బంతి ఎటువైపు వెళ్లింది అన్నది కూడా పాండ్యా చూడలేదు.  బంతి కీపర్ తలపై నుంచి మెరుపు వేగంతో బౌండరీకి దూసుకెళ్లింది. ఆ తర్వాత బౌలర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. పాండ్యా షాట్ చూసిన బంగ్లా ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు షాట్ ఆఫ్ ది ఇయర్‌గా అభివర్ణిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement