బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం | India vs Bangladesh U19 World Cup 2026 | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

Jan 17 2026 10:44 PM | Updated on Jan 17 2026 10:48 PM

India vs Bangladesh U19 World Cup 2026

అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత్ జట్టు 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ టీమ్‌పై విజయం సాధించింది. సవరించిన 165 పరుగుల (29 ఓవర్లలో) లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్‌ కుర్రాళ్ల టీమ్‌ తడబడింది. 146 పరుగులకు ఆలౌటైంది. విహాన్ మల్హోత్రా 14 పరుగులకు 4 వికెట్లు తీశాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్‌ జట్టు 238 పరుగులు చేసింది. 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ 67 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. యూత్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. 17 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుండు 80 పరుగులతో రాణించాడు. బంగ్లాదేశ్ తరఫున పేసర్ అల్ ఫహద్ ఐదు వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement