
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో (India vs Bangladesh) మరో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అభి'షేక్' (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించడంతో అభిషేక్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది.
ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లి (Virat kohli) తర్వాత వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ప్రస్తుత ఎడిషన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్ ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లు ఆడిన అతను.. 206.67 స్ట్రయిక్‌రేట్‌తో 248 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి 3 ఓవర్లలో నిదానంగా ఆడినప్పటికీ.. ఆతర్వాత అభిషేక్ గేర్ మార్చడంతో ఒక్కసారిగా పుంజుకుంది. అభిషేక్, గిల్ క్రీజ్‌లో ఉన్నంత వరకు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు.. ఈ ఇద్దరు ఔట్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది.
వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 15 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా (11), అక్షర్ పటేల్ (2) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ 75, గిల్ 29, శివమ్ దూబే 2, సూర్యకుమార్ యాదవ్ 5, తిలక్ వర్మ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలరల్లో రిషద్ హొసేన్ 2, తంజిమ్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ రనౌటయ్యాడు.
చదవండి: సందిగ్దంలో సెలెక్టర్లు.. విండీస్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన వాయిదా