బంగ్లాతో రెండో టీ20.. తెలుగోడికి నో ఛాన్స్‌! అతడి అరంగేట్రం | Predicted India Playing XI 2nd T20I Aganist Bangladesh | Sakshi
Sakshi News home page

IND vs BAN: బంగ్లాతో రెండో టీ20.. తెలుగోడికి నో ఛాన్స్‌! అతడి అరంగేట్రం

Oct 7 2024 8:41 PM | Updated on Oct 9 2024 9:28 AM

Predicted India Playing XI 2nd T20I Aganist Bangladesh

గ్వాలియ‌ర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టీ20లో ఘ‌న విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టు.. ఇప్పుడు రెండో టీ20కు సిద్ద‌మైంది. ఆక్టోబ‌ర్ 9న ఢిల్లీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో టీ20లో బంగ్లాతో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో సూర్య‌కుమార్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు సోమ‌వారం ఢిల్లీలో అడుగుపెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సూర్య సేన‌కు అభిమానులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి.

నితీష్ కుమార్‌కు నో ఛాన్స్‌..
ఇక రెండో టీ20లో అదే జోరును కొన‌సాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని టీమిండియా ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు ఓ కీల‌క మార్పు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన నితీష్ కుమార్ రెడ్డికి రెండో మ్యాచ్‌కు ప‌క్క‌న పెట్టాల‌ని భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది.

అత‌డి స్ధానంలో పేస‌ర్ హ‌ర్షిత్ రాణా అరంగేట్రం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదొక్క‌టి మిన‌హా భార‌త జ‌ట్టులో పెద్ద‌గా మార్పులు చోటు చేసుకోక‌పోవ‌చ్చు. కాగా అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంది. ఈ క్ర‌మంలో ఒక‌వేళ‌ టీమిండియా తొలుత  బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ న‌మోదు కావ‌డం ఖాయం.

రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిల‌క్ వ‌ర్మ‌,  హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హ‌ర్షిత్ రానా, అర్షదీప్ సింగ్.
చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్‌ అదే: మంధాన

 

Advertisement
 
Advertisement
Advertisement