న్యూజిలాండ్‌తో సిరీస్‌.. ఆ ముగ్గురి వల్లే జ‌ట్ల ఎంపిక ఆల‌స్యం! | Slight Delay-Team India-ODI-Test Squad Selection-Waiting For-3-Players | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో సిరీస్‌.. ఆ ముగ్గురి వల్లే జ‌ట్ల ఎంపిక ఆల‌స్యం!

Oct 14 2026 12:51 PM | Updated on Oct 14 2026 1:46 PM

Slight Delay-Team India-ODI-Test Squad Selection-Waiting For-3-Players

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగియ‌గానే టీమిండియా బృందం వెంట‌నే న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌నుంది. అక్టోబ‌ర్ 22 నుంచి భార‌త్‌, న్యూజిలాండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ సిరీస్ ముగిసిన త‌ర్వాత ఐదు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాల్సి ఉంది. టీ20 సిరీస్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ వ‌న్డే, టెస్టు సిరీస్‌కు మాత్రం ఇంకా జ‌ట్టును ప్ర‌క‌టించ‌లేదు. 

ఈ వారంలో క‌చ్చితంగా జ‌ట్టును ప్ర‌క‌టిస్తార‌ని భావించిన‌ప్ప‌టికీ, ఎంపిక ప్ర‌క్రియ మ‌రింత ఆల‌స్యం కానున్న‌ట్లు తెలుస్తోంది. ముగ్గురి ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నందున జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఆల‌స్యమ‌వనున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గాయాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రిష‌బ్ పంత్‌, హ‌ర్షిత్ రానా, ప్ర‌సిధ్ క్రిష్ణల‌ను ఎంపిక చేసే విష‌య‌మై ఒక వారంపాటు వేచి చూడాల‌ని సెలెక్ష‌న్ క‌మిటీ భావిస్తోంద‌ట‌. ఈ ముగ్గురిని ఎంపిక చేయాలా వ‌ద్దా అనేది వారి ఫిట్‌నెస్ ప‌రిస్థితిపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని తెలిపింది.

విండీస్‌తో వ‌న్డే సిరీస్ సంద‌ర్భంగా తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతూ ప్ర‌సిధ్ క్రిష్ణ సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. అతడు కోలుకోవ‌డానికి దాదాపు మూడు వారాలు ప‌ట్ట‌నుంది. అక్టోబ‌ర్ 21తో మూడు వారాలు పూర్త‌వ‌నుండ‌డంతో అత‌డి ఫిట్‌నెస్‌ను గ‌మ‌నించి ఆ త‌ర్వాత ఎంపిక ప్ర‌కియ షురూ చేయాల‌ని సెలెక్ష‌న్ క‌మిటీ అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. 

ఇక ఇరానీ క‌ప్ స‌మ‌యంలో గాయంతో భాద‌ప‌డిన‌ పంత్ కూడా కోలుకోవ‌డానికి మూడు వారాలు ప‌ట్ట‌నుంది. దీంతో అత‌డు న్యూజిలాండ్‌-ఎతో జ‌ర‌గ‌నున్న తొలి రెండు మ్యాచ్‌ల‌కు దూరంగా ఉండనున్నాడు. ప్ర‌స్తుతం పంత్ బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ (సీవోఈ) కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. వ‌న్డే సిరీస్ ఆడ‌క‌పోయినా టెస్టు సిరీస్‌లో పంత్ ఆడే అవ‌కాశ‌ముంది.

ప్ర‌స్తుతం అదే సీవోఈలో ఉన్న ప్ర‌సిధ్ క్రిష్ణ కూడా అక్టోబ‌ర్ 25న ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు సిములేష‌న్ గేమ్ ఆడ‌నున్నాడు. ఇందులో పాస‌యితే అత‌డికి ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్ ల‌భించ‌నుంది. న‌వంబ‌ర్ 4 నుంచి వ‌న్డే సిరీస్ మొద‌లుకానున్న నేప‌థ్యంలో భార‌త వ‌న్డే జ‌ట్టు అక్టోబ‌ర్ 28న న్యూజిలాండ్‌కు వెళ్ల‌నుంది. హ‌ర్షిత్ రానా ఫిట్‌నెస్ టెస్టు త‌ర్వాత మూడు రోజుల‌కు జ‌ట్టు వెళ్ల‌నుండ‌డంతో  క్లియ‌రెన్స్ వ‌స్తే అత‌డి పేరును ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే చాన్స్ ఉంది.

న్యూజిలాండ్ సిరీస్‌కు పైన చెప్పిన ముగ్గురు ఆట‌గాళ్లు కీల‌కం కావ‌డంతోనే వీరికోసం మ‌రో వారం వేచి చూద్దామ‌ని, ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్ రాక‌పోతే అప్పుడు జ‌ట్టును ఎంపిక చేద్దామ‌ని బీసీసీఐకి సెల‌క్ష‌న్ క‌మిటీ విన్న‌వించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబ‌ర్ 25లోగా కివీస్‌తో వ‌న్డే, టెస్టు సిరీస్ ఆడ‌నున్న జ‌ట్ల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది.

ఇదీ చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement