Photo Credit: Twitter
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక టీ20 టోర్నీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. తన అనుమతి లేకుండానే తన పేరును పాకిస్తాన్ ఆటగాళ్లు ఉన్న జట్టులో ప్రకటించడాన్ని శిఖర్ ధావన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. విషయంలోకి వెళితే.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ టోర్నమెంట్లో భాగంగా 'ఆసియా వారియర్స్' జట్టులోని ఆటగాళ్ల పేర్లను విడుదల చేశారు.
ఇందులో శిఖర్ ధావన్తో పాటు భారత మాజీ ఆటగాళ్లు రాహుల్ శర్మ, గుర్కీరత్సింగ్ మాన్ , అభిమన్యు మిథున్ కూడా ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఇదే జట్టులో సోహైల్ తన్వీర్ , ఇఫ్తికార్ అహ్మద్ , మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు పాకిస్తానీ క్రికెటర్లకు కూడా చోటు దక్కడం గమనార్హం.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శిఖర్ ధావన్ ఈ టోర్నమెంట్తో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. ఈ ఈవెంట్కు తాను దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశాడు. తన అనుమతి లేకుండా పేరును వాడుకున్న సదరు టీ20 లీగ్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలకు దిగనున్నట్లు పేర్కొన్నాడు.
ధావన్ మాట్లాడుతూ.."వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్లో పాల్గొనే వ్యక్తిగా నా పేరు నా కంటపడింది. నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా నిర్వాహకులు నా పేరును ఉపయోగించారు. దీనిపై నా లీగల్ బృందం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇది చూసి నేను ఊరుకోను.. వారందరినీ కోర్టుకీడుస్తా. ఇక మీడియా, నా అభిమానులు దీనిపై ఎలాంటి అనధికారిక ప్రకటనలను ప్రచురించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మీ నిరంతర ప్రేమ, మద్దతుకు నా ధన్యవాదాలు.'' అని చెప్పుకొచ్చాడు.
12 ఏళ్ల పాటు టీమిండియాకు..
టీమిండియా గబ్బర్గా పేరు పొందిన శిఖర్ ధావన్ 2010 నుంచి 2022 మధ్య భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ధావన్ 34 టెస్టుల్లో 2,315 పరుగులు, 167 వన్డేల్లో 6,793 పరుగులు, 68 టీ20ల్లో 1,759 పరుగులు సాధించాడు. ధావన్ ఖాతాలో ఏడు టెస్టు సెంచరీలు, 17 వన్డే సెంచరీలు ఉన్నాయి.
I have come across my name as a participant in the World T20 Continent Cup. My name has been used by the organisers without my knowledge or permission, and my team will be taking the appropriate legal steps to address this. I request the media and my fans to not report or rely on any unauthorised announcements. Thank you for your continued love and support. 🙏
— Shikhar Dhawan (@SDhawan25) October 13, 2026

PC: Instagram
గతేడాది ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ధావన్ మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా తన గళాన్ని గట్టిగా వినిపించాడు. ఆపరేషన్ సింధూర్ చర్యను సమర్థించిన ధావన్.. ''ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకున్న చర్య అభినందనీయం. భారత్ మాతా కీ జై'' అని ధావన్ ఆ సమయంలో ట్వీట్ చేశాడు.
ఇదీ చదవండి:


