సొంతగడ్డపై తిలక్‌ను ఊరిస్తున్న రికార్డు.. లైన్‌లో సంజూ కూడా! | Tilak Varma-Sanju Samson-Eyes-Major Record-IND-Vs-WI-4th T20-Uppal | Sakshi
Sakshi News home page

సొంతగడ్డపై తిలక్‌ను ఊరిస్తున్న రికార్డు.. లైన్‌లో సంజూ కూడా!

Oct 14 2026 9:34 AM | Updated on Oct 14 2026 10:05 AM

Tilak Varma-Sanju Samson-Eyes-Major Record-IND-Vs-WI-4th T20-Uppal

Photo Credit: Twitter

ఉప్ప‌ల్ వేదిక‌గా టీమిండియా, వెస్టిండీస్ మ‌ధ్య నాలుగో టీ20 జ‌ర‌గ‌నుంది. ఇవాళ జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌ను భార‌త వైస్ కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ త‌న హోంగ్రౌండ్‌లో ఆడ‌నున్నాడు. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు ఆట ఏ విధంగా ఉండ‌బోతుంద‌నేది విలేకరుల స‌మావేశంలో వెల్ల‌డించాడు. తాజాగా సొంత‌గ‌డ్డ‌పై టీ20 మ్యాచ్ ఆడుతున్న తిల‌క్ వ‌ర్మ‌ను ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. 

ఈ మ్యాచ్‌లో ఆ రికార్డు అందుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే అయిన‌ప్ప‌టికీ, సొంత ప్రేక్ష‌కుల మ‌ధ్య ఆ ఫీట్‌ను సాధిస్తే వ‌చ్చే కిక్కు వేరుగా ఉంటుంది. తిల‌క్ వ‌ర్మ‌ మ‌రో 10 సిక్స‌ర్లు కొడితే అత‌డి ఖాతాలో వంద సిక్స‌ర్ల రికార్డు చేర‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు 68 మ్యాచ్‌ల్లో 1791 ప‌రుగులు సాధించిన తిల‌క్ వ‌ర్మ ఖాతాలో 90 సిక్స‌ర్లు, 138 ఫోర్లు ఉన్నాయి. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌స్తున్న తిల‌క్ వ‌ర్మ సొంత గ‌డ్డ‌పై 10 సిక్స‌ర్లు కొట్టి రికార్డును అందుకుంటాడా అన్న‌ది చూడాలి.

రెండు సిక్సర్లు కొడితే..
తిల‌క్ వ‌ర్మ‌తో పాటు ఓపెన‌ర్ సంజూ సామ్స‌న్ కూడా వంద సిక్స‌ర్ల రికార్డుకు అత్యంత ద‌గ్గ‌ర్లో ఉన్నాడు. ప్ర‌స్తుతం సంజూ ఖాతాలో 98 సిక్స‌ర్లు ఉన్నాయి. మ‌రో రెండు కొడితే వంద సిక్స‌ర్ల రికార్డు అత‌డి సొంత‌మవుతోంది. మూడో టీ20లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ, ఉప్ప‌ల్ మైదానంలో సామ్స‌న్ ట్రాక్ రికార్డు ఘ‌నంగా ఉండ‌డంతో ఈ వేదిక‌లోనే ఆ రికార్డును అందుకునే అవ‌కాశ‌ముంది. సంజూ సామ్స‌న్ ఉప్ప‌ల్ త‌న ఫామ్‌ను కొన‌సాగించి రికార్డు అందుకుంటాడా లేదా చూడాలి.

భారత్‌ నుంచి ఐదుగురు మాత్రమే..
ఇక అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఐదుగురు ఆట‌గాళ్లు మాత్ర‌మే 100 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకున్నారు. రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలు మాత్ర‌మే టీ20ల్లో 100 సిక్స‌ర్లు బాదారు.

అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త బ్యాటర్లు..
👉రోహిత్ శ‌ర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్స‌ర్లు
👉సూర్య‌కుమార్ యాద‌వ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్స‌ర్లు
👉అభిషేక్ శ‌ర్మ – 65 మ్యాచ్‌ల్లో 141 సిక్స‌ర్లు
👉హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్స‌ర్లు
👉విరాట్ కోహ్లి – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్స‌ర్లు
👉కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్స‌ర్లు
👉సంజూ శాంస‌న్ – 75 మ్యాచ్‌ల్లో 98 సిక్స‌ర్లు
👉తిల‌క్ వ‌ర్మ – 68 మ్యాచ్‌ల్లో 90 సిక్స‌ర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement