breaking news
Gurkeerat Singh
-
వరల్డ్‌కప్ జరుగుతుండగా టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్..!
టీమిండియా వెటరన్ ఆటగాడు గురుకీరత్ సింగ్ మాన్ అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా గురుకీరత్ సింగ్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో భారత జట్టు తరుపున డెబ్యూ చేసిన ఫోటోలను షేర్ చేశాడు. "ఈ రోజుతో నా అద్భుతమైన క్రికెట్ ప్రయాణం ముగిసింది. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, పీసీఏ, నా తోటి ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ గురుకీరత్ పేర్కొన్నాడు. గురుకీరత్ సింగ్ 2016లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గుర్కీరత్ తన అంతర్జాతీయ కెరీర్లో కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడాడు. తన కెరీర్లో మూడు వన్డేలు ఆడిన అతడు కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. అయితే తన అరంగేట్ర సిరీస్‌లో నిరాశపరిచిన గురుకీరత్‌కు మళ్లీ భారత జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. కాగా దేశవాళీ క్రికెట్లో పంజాబ్ జట్టుకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. అదే విధంగా ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ వంటి జట్లు తరపున గురుకీరత్ సింగ్ ఆడాడు. చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు! View this post on Instagram A post shared by Gurkeerat Mann (@gurkeeratmann) -
ఒక్క చాన్స్ వస్తే చాలు..!
నేనేంటో నిరూపించుకుంటా ఆసీస్‌తో సిరీస్‌కు స్థానం ఆశిస్తున్నా ‘సాక్షి’తో గుర్కీరత్ సింగ్ సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సమయంలో మొహాలీలో భారత జట్టుకు సహాయంగా ఉండేందుకు స్థానిక క్రికెటర్ గుర్కీరత్ సింగ్‌ను ఎంపిక చేశారు. అయితే బెంగళూరులో రెండో టెస్టు కోసం అతడికి అనూహ్యంగా పిలుపు దక్కడం అందరినీ ఆశ్చర్యపరచింది. ‘అతనిలోని సామర్థ్యమే ఈ అవకాశం కల్పించింది. ఆరు లేదా ఏడో స్థానాల్లో ధాటిగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల గుర్కీరత్ త్వరలోనే భారత్‌కు ఆడతాడు చూడండి. జట్టు వ్యూహాల్లో అతను సరిగ్గా సరిపోతాడు’ అని స్వయంగా కెప్టెన్ కోహ్లి ప్రశంసించడం ఆ యువ ఆటగాడికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించింది. ఫలితంగా మ్యాచ్ అవకాశం దక్కకపోయినా... అతను సిరీస్ చివరి వరకు జట్టుతో కొనసాగాడు. వన్డేల్లోనూ ఇంకా అవకాశం లభించని గుర్కీరత్ ఆ ఒక్క చాన్స్ కోసమే ఎదురు చూస్తున్నానంటున్నాడు. పంజాబ్ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు నగరానికి వచ్చిన గుర్కీరత్ తన కెరీర్ గురించి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే... దక్షిణాఫ్రికాతో సిరీస్: ఐపీఎల్లో ఆడితే ఇతరులనుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెబుతారు. కానీ దాంతో పోలిస్తే భారత జట్టు సభ్యుడిగా ఉండే అనుభవమే వేరు. అటు వన్డే సిరీస్‌లోనూ, ఆ తర్వాత టెస్టు సిరీస్‌లోనూ సుదీర్ఘ సమయం పాటు టీమిండియాతో కలిసి ఉండటం నాకు ఎంతో ఉపయోగపడింది. మ్యాచ్ ఆడలేకపోయినా నాకు ఎలాంటి నిరాశ లేదు. డ్రెస్సింగ్ రూంలో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇక ఢిల్లీలో విజయం తర్వాత నిర్విరామ సంబరాల్లో భాగం కావడం ఎప్పటికీ మరచిపోలేను. తుది జట్టులో స్థానం: ఇక్కడి దాకా వచ్చాను... అక్కడికి వెళ్లలేనా! అందరిలాగే నేను అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదని నమ్ముతున్నా. ఒక్కసారి మ్యాచ్ అవకాశం వస్తే నన్ను నేను నిరూపించుకుంటా. దేశవాళీలో రెండు సీజన్లుగా నిలకడగా (వరుసగా 449, 677 పరుగులు) రాణిస్తున్నాను. ఐపీఎల్ ద్వారా చాలా మందికి నేను పరిచయమైనా... దానికంటే రంజీ ట్రోఫీ క్రికెట్ వల్లే నాకు గుర్తింపు దక్కుతుందని నమ్మినవాడిని. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను కాబట్టి ప్రదర్శనపై, వైఫల్యంపై ఆందోళన లేదు. ఇండియా ‘ఎ’ అనుభవం: ముక్కోణపు సిరీస్‌లో, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో ‘ఎ’ జట్టు సభ్యుడిగా ఉండటంతో నా ఆట ఎంతో మెరుగుపడింది. ముఖ్యం గా షాట్లు ఆడే విషయంలో ద్రవిడ్ పలు సూచనలు ఇచ్చారు. సరైన సమయంలో నేను అక్కడ బాగా రాణించగలిగాను. రంజీల్లో, దేశవాళీ వన్డేల్లో, టి20ల్లోనూ నా రికార్డు బాగుంది. ఫార్మాట్‌కు తగినట్లుగా శైలిని మార్చుకోగలగడమే మంచి ఆటగాడి లక్షణం. నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. ఓవరాల్ కెరీర్: యువ క్రికెటర్‌గా ఇప్పటివరకు నా ప్రదర్శనపై సంతృప్తిగానే ఉన్నా. మొహాలీ గ్రౌండ్ పక్కనే మా ఇల్లు ఉంది. దాంతో సహజంగానే క్రికెట్‌పై దృష్టి మళ్లింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన నాన్న ప్రోత్సాహంతో వివిధ వయో విభాగాల్లో నిలకడగా రాణించా. మూడేళ్ల క్రితం అండర్-22 ఫైనల్లో ఢిల్లీపై చేసిన 190 పరుగులు నా కెరీర్‌ను మలుపు తిప్పాయి. అయితే మున్ముందు భారత జట్టు తరఫున రెగ్యులర్‌గా ఆడటమే లక్ష్యం. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌తో అది మొదలు అవుతుందని ఆశిస్తున్నా. ఇతర ఆటగాళ్ల ప్రోత్సాహం: మా అందరికీ హర్భజన్ సింగే స్ఫూర్తి. అతనితో కలిసి ఆడటం గర్వకారణం. నేను ఆఫ్‌స్పిన్నర్‌ను కాబట్టి దాదాపు ప్రతి చిన్న అంశంలో అతని సూచనలు, సలహాలు తీసుకుంటా. అనుమానాలు తీర్చుకుంటా. మైదానం బయట ‘ప్లే స్టేషన్’ను ఇష్టపడే నాకు బైక్‌లంటే పిచ్చి. వన్డే సిరీస్ సమయంలో ధోనితో బైక్‌ల గురించి కొంత మాట్లాడే అవకాశం కూడా దక్కింది! -
గుర్ కీరత్ పై కోహ్లి ప్రశంసలు
బెంగళూరు: ఇటీవల కాలంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ల్లో ఆకట్టుకుంటున్న పంజాబ్ ఆల్ రౌండర్ గుర్ కీరత్ సింగ్ మన్ పై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. అతనొక ప్రమాదకర ఆటగాడని, ప్రత్యర్థి చేతుల్లోంచి మ్యాచ్ ను లాగేసుకుంటాడంటూ గుర్ కీరత్ ను విరాట్ కొనియాడాడు. శనివారం నుంచి బెంగళూరులో ఆరంభం కానున్న రెండో టెస్టులో గుర్ కీరత్ తుది జట్టులో ఉండవచ్చనే సంకేతాల నేపథ్యంలో విరాట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలో టీమిండియా జట్టులో గుర్ కీరత్ కీలక సభ్యుడైనా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నాడు. ఈ సందర్భంగా ముందుగా గుర్ కీరత్ కు శుభాకాంక్షలు తెలిపిన విరాట్.. అతను ఎప్పుడు ఆడతాడనేది కచ్చితంగా చెప్పలేనన్నాడు. టీమిండియా ప్రధాన సమస్యగా మారిన ఆరు, ఏడు స్థానాల్లో ఆడటానికి గుర్ కీరత్ బ్యాటింగ్ శైలి అతికినట్లు సరిపోతుందంటూ విరాట్ అభిప్రాయపడ్డాడు. 'గుర్ కీరత్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. సహజసిద్ధంగా ఆడతాడు. ప్రత్యర్థి జట్ల గెలుపును కూడా అనేక సందర్భాల్లో అడ్డుకున్నాడు. ఈ సీజన్ లో ఇండియా -ఏ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. గుర్ కీరత్ ప్రధానంగా బ్యాట్స మెన్. బౌలింగ్ కూడా ఆకట్టుకుంటాడు. బౌలింగ్ లో ఎక్కువగా కష్టపడతాడు. రాబోవు ఏడాదిన్నర కాలంలో టీమిండియా చాలా టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఈ తరహా క్రికెటర్ల అవసరం జట్టుకు చాలా ఉంది' అని కోహ్లి తెలిపాడు.