రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు.. స్పందించిన ముంబై ఇండియ‌న్స్‌! | Mumbai Indians Shut Down Rohit Sharma Captaincy-Rumours-IPL-2027-Season | Sakshi
Sakshi News home page

రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు.. స్పందించిన ముంబై ఇండియ‌న్స్‌!

Oct 14 2026 7:23 AM | Updated on Oct 14 2026 7:29 AM

Mumbai Indians Shut Down Rohit Sharma Captaincy-Rumours-IPL-2027-Season

Photo Credit: IPL Twitter

టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్‌ రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్‌కు మ‌రోసారి కెప్టెన్‌గా వ్య‌వ‌హరించే అవ‌కాశాలున్న‌ట్లు మంగ‌ళ‌వారం రాత్రి సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. 2027 ఐపీఎల్ సీజ‌న్‌కు ముందే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియ‌న్స్‌ను వీడే అవ‌కాశ‌ముంద‌ని, అందువ‌ల్ల రోహిత్‌ను మ‌రోసారి కెప్టెన్‌గా ఎంపిక చేసే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. 

ఆ వార్తల్లో నిజం లేదు: ముంబై ఇండియన్స్‌
అయితే ఈ వార్త‌ల‌ను ఖండించిన‌ ముంబై ఇండియ‌న్స్ ప్రాంచైజీ రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా వ్యవరిస్తాడన్న ఊహాగానాలకు తెరదించింది. తమ టీంకు రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడని వార్తలు వస్తున్నాయని, అయితే అవన్నీ ఊహాగానాలేనని ముంబై ఇండియన్స్ వర్గాలు తెలిపాయి. ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు కెప్టెన్‌గా ఎవరిని నియమించాలన్న విషయంపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నాయి. 

గత సీజన్‌లో కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యనే మళ్లీ కొనసాగించే అవకాశం ఉందని ఆ వర్గాలు చెప్పాయి. ఒకవేళ తమ జట్టును హార్దిక్ వదిలివెళితే, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని వెల్లడించాయి. అయితే, ఇప్పటివరకూ హార్దిక్‌కు సరైన ప్రత్యామ్నాయం కనిపించలేదని తెలిపాయి. హార్దిక్ తమ జట్టును వీడితే.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జట్టును నడిపించడానికి రెడీగా ఉన్నారని వివరించాయి. మిచెల్ సాంట్నర్ కూడా సిద్ధంగా ఉన్నాడని తెలిపాయి.

ఐదుసార్లు టైటిల్స్‌..
గ‌తంలో రోహిత్ కెప్టెన్సీలోనే ముంబై ఇండియ‌న్స్ ఐదుసార్లు (2013, 2105, 2017, 2019, 2020) టైటిల్ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే 2024 సీజన్‌కు ముందు హార్దిక్‌ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్న తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ హార్దిక్‌ కెప్టెన్సీలో తొలి సీజన్‌లో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. 2025లో ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ.. టైటిల్ మాత్రం‌ గెలవలేకపోయింది. దీంతో వచ్చే సీజన్‌కు నాయకత్వంలో మార్పు ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజా నివేదికల ప్రకారం రోహిత్‌ పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

2027 ఐపీఎల్‌ సీజన్‌లో రోహిత్‌ 40 ఏళ్లకు చేరువలో ఉంటాడు. అదే ఏడాది వన్డే ప్రపంచకప్‌ కూడా జరగనుంది. దీంతో ఐపీఎల్‌లో అతడి భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది. 2027 సీజన్‌ తర్వాత కూడా ఆడతాడా? లేక అదే చివరిదవుతుందా? అనే చర్చ మొదలైంది. అయితే రోహిత్ ఆడ‌క‌పోయినా ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీకి మెంటార్‌గా ప‌నిచేసే అవ‌కాశం లేక‌పోలేదు.

ఇదీ చ‌ద‌వండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement