చ‌రిత్ర సృష్టించిన తిలక్‌-నితీశ్‌.. తొలి భారత జోడీగా | Tilak Varma, Nitish Reddy Create Partnership Record vs New Zealand | Sakshi
Sakshi News home page

IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన తిలక్‌-నితీశ్‌.. తొలి భారత జోడీగా

Oct 24 2026 7:26 PM | Updated on Oct 24 2026 7:29 PM

Tilak Varma, Nitish Reddy Create Partnership Record vs New Zealand

PC: X

క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో తెలుగు తేజాలు తిలక్ వర్మ(51నాటౌట్‌), నితీశ్ కుమార్ రెడ్డి(26 నాటౌట్‌)లది కీలక పాత్ర. 

ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును వారిద్దరూ తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. తిలక్‌-నితీశ్ ఏడో వికెట్‌కు అజేయంగా 69 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. త‌ద్వారా ఈ తెలుగు క్రికెట‌ర్లు ఓ అరుదైన రికార్డును త‌మ పేరిట లిఖించుకున్నారు. 

ఏడో వికెట్‌కు అత్య‌ధిక భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన భార‌త జోడిగా వారిద్ద‌రూ నిలిచారు. ఇంత‌కుముందు ఈ రికార్డు  దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్యా పేరిట ఉండేది. వారిద్ద‌రూ 2019లో 7 వికెట్‌కు 63 ప‌రుగుల పార్ట‌న‌ర్‌షిప్‌ను నెల‌కొల్పారు. తాజా ప్ర‌ద‌ర్శ‌న‌తో వారి ఆల్‌టైమ్ రికార్డును నితీశ్‌-తిల‌క్ జంట బ్రేక్ చేసింది. కాగా ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

7వ వికెట్‌కు అత్య‌ధిక భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన భార‌త జోడీలు
69* - నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ vs న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్, 2026 (7వ వికెట్)
63* - దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్యా vs న్యూజిలాండ్, హామిల్టన్, 2019 (7వ వికెట్)
61 - హర్భజన్ సింగ్, సురేష్ రైనా vs న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్, 2009 (8వ వికెట్)
59* - ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ vs శ్రీలంక, కొలంబో (RPS), 2009 (8వ వికెట్)
59* - రవిచంద్రన్ అశ్విన్, ఎం.ఎస్. ధోనీ vs ఆస్ట్రేలియా, సిడ్నీ, 2012 (7వ వికెట్)
చదవండి: IND vs NZ: అభిషేక్‌ శర్మ ప్రపంచ రికార్డు.. ఒకే ఒక్కడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement