అభిషేక్‌ శర్మ ప్రపంచ రికార్డు.. ఒకే ఒక్కడు | Abhishek Sharma Becomes 1st Indian Opener To Attain Historic T20I Feat | Sakshi
Sakshi News home page

IND vs NZ: అభిషేక్‌ శర్మ ప్రపంచ రికార్డు.. ఒకే ఒక్కడు

Oct 24 2026 3:23 PM | Updated on Oct 24 2026 3:45 PM

Abhishek Sharma Becomes 1st Indian Opener To Attain Historic T20I Feat

PC: BCCI/X

టీమిండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌న రికార్డుల వేట‌ను కొన‌సాగిస్తున్నాడు. క్రైస్ట్‌చ‌ర్చ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టీ20లో అభిషేక్ శ‌ర్మ మ‌రో అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో అంత‌ర్జాతీయ టీ20ల్లో 1000 ప‌రుగులు చేసిన తొలి భార‌త ఓపెన‌ర్‌గా అభిషేక్ నిలిచాడు.

ఓవ‌రాల్‌గా భారత్ తరఫున ఈ అరుదైన ఘనత సాధించిన మూడో ఆటగాడిగా శ‌ర్మ రికార్డులకెక్కాడు. అత‌కంటేముందు సూర్యకుమార్ యాదవ్ (2022లో 1,164 పరుగులు), ఇషాన్ కిషన్ (2026లో 1,159 పరుగులు) ఈ ఫీట్ సాధించారు. ఇక ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ టీ20  క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ ఘ‌న‌త సాధించిన 8వ బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు.

తొలి ప్లేయర్‌గా రికార్డు..
అదేవిధంగా అంత‌ర్జాతీయ టీ20ల్లో  పవర్‌ప్లేలో 100 సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాటర్‌గా అభిషేక్ శర్మ వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. అభిషేక్ కంటే ముందు ఏ బ్యాటర్ కూడా ఈ ఘనతను అందుకోలేకపోయారు. దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్ వరుసగా 98, 97 సిక్సర్ల వద్దే ఆగిపోయారు. కాగా ఈ మ్యాచ్‌లో అభిషేక్ 21 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి ఔటయ్యాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు
100* - అభిషేక్ శర్మ
98 - రోహిత్ శర్మ 
97 - మార్టిన్ గప్టిల్
94 - పాల్ స్టిర్లింగ్
87 - క్వింటన్ డి కాక్
చదవండి: NZ vs INS: వారెవ్వా.. సూపర్‌మేన్‌లా! నీలాంటి ప్లేయ‌ర్ క్రికెట్ హిస్ట‌రీలోనే లేడు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement