breaking news
girls dance in video
-
పాక్‌లో షరారత్ క్రేజ్ మామూలుగా లేదుగా, అమ్మాయిల స్టెప్పులు వైరల్
బాలీవుడ్ స్టార్హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ దురంధర్ (Dhurandhar ) బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అంతేకాదు గ్లోబల్‌గా కూడా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ మూవీలో పాటల క్లిప్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'షరారత్' (Shararat) పాటతో ఒక పెళ్లి వేడుకలో పాకిస్తాన్ అమ్మాయిలు స్టెప్పులు నెట్టింట సందడిగా మారాయి.పాకిస్తానీ మహిళలు సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తోంది. ఈ క్లిప్‌లో, ఇద్దరు మహిళలు పెళ్లి వేదిక లోపల 'షరారత్' పాటకు డ్యాన్స్ చేస్తుండగా, ఇతర అతిథులు వారిని చూస్తూ ప్రోత్సహిస్తున్నారు.ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు స్పందిస్తూ, నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమా ఇంతటి ఆదరణ పొందడంపై కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. “నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఇంత క్రేజ్.. వావ్,” అని ఒకరు, “పాకిస్తానీలు దురంధర్‌ను విపరీతంగా ఇష్టపడు తున్నారు. బహుశా ఈ మూవీ దర్శకుడు ఆదిత్య ధార్‌కు నిషాన్-ఎ-పాకిస్తాన్ ఇస్తారేమో అని మరొకరు వ్యాఖ్యానించారు. భారత ఉపఖండంపై బాలీవుడ్ సాంస్కృతిక ముద్ర ఉందని మరకొరు కమెంట్ చేశారు.Pakistani girls dancing to Shararat despite the ban on Dhurandhar. https://t.co/l89mWhDEdH— Abhishek Dhiman (@Abhi_dhiman8090) January 5, 2026కాగా దురంధర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే పాకిస్తాన్‌తో పాటు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలలో ఈ మూవీ విడుదల కాలేదు. అయినా కూడా 2025లో విదేశాలలో అత్యంత విజయ వంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది.మరోవైపు ఆయేషా ఖాన్,క్రిస్టల్ డిసౌజా నటించిన 'షరారత్' డ్యాన్స్ నంబర్ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌లో 100 మిలియన్ల వీక్షణలను దాటింది. ఈ పాటకు శశ్వత్ సచ్దేవ్ సంగీతం అందించగా, మధుబంతి బాగ్చి , జాస్మిన్ సాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదొక గూఢచారి థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ ,సంజయ్ దత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీని రెండవ భాగం మార్చి 2026లో విడుదల కానుందని భావిస్తున్నారు. -
Viral Video: పెళ్లిలో అమ్మాయిల తీన్మార్ స్టెప్పులు, చేతిలో డ్రింక్ బాటిల్ పట్టుకొని..
పెళ్లి అంటేనే సందడి.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల హడావిడీ.. డీజే పాటలు, డ్యాన్ స్టెప్పుల ఉత్సాహం.. మొత్తంగా ఒక పండగ వాతావరణం తలపిస్తుంది. పాత కాలంలో జరిగే పెళ్లిళ్లకు.. ఇప్పుడు జరిగే వివాహాలకు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కాలంలో పెళ్లి వేడుకను జీవితాంతం గుర్తిండిపోయేలా వైభవంగా నిర్వహించుకుంటున్నారు. సంగీత్‌లు, మెహందీ ఫంక్షన్లు, డీజేలు ఏర్పాటు చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లిలో వరుడు, వధువు డ్యాన్స్ చేయడం కామన్ అయిపోయాయి. కానీ కేవలం అమ్మాయిలే గ్రూప్‌లా ఏర్పడి డప్పుచప్పుళ్లకు స్టెప్పులు వేస్తే ఆ కిక్కే వేరు. ముఖ్యంగా పంజాబ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో వివాహాలు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇలాంటి డ్యాన్స్‌లు, ఎంజాయ్‌మెంట్‌తో నిండి ఉంటుంది. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పెళ్లి కొడుకు బారాత్ తో పెళ్లి వేదిక వద్దకు చేరుకోగా.. అక్కడున్న యువతులందరు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. కాక్టెయిల్ సినిమాలోని యో యో హనీసింగ్ పాపులర్ పాట మెయిన్ షరాబీ పాటకు చిందులేశారు. బ్యాండ్ వాళ్ల దగ్గరికి వెళ్లి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్! ఇందులో ఓ యువతి చేతిలో డ్రింక్బాటిల్ పట్టుకొని జోరుగా డ్యాన్స్ చేస్తూ కనిపించడం అందరిని ఆకట్టుకుంటోంది. యువతల డ్యాన్స్ అందరిలోను జోష్ పెంచేసింది. ఇంకా ఇంకా జోరుగా కొట్టాలని కోరారు. దాంతో బ్యాండ్ బాజా టీమ్ మరింతగా బీచ్ పెంచింది. వారి హంగామాతో... పెళ్లి వేడుకలో ఒక్కసారిగా సందడి పెరిగింది. దీనిని ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ షేర్ చేశారు. ఇప్పటి వరకు లక్షల వ్యూవ్స్. 10 వేల లైకులు వచ్చాయి. చాలా మంది కామెంట్లలో ఫన్నీ, హార్ట్ సింబల్ ఇమోజీలను పోస్ట్ చేస్తున్నారు. చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఉదయం కొన్నాడు.. సాయంత్రానికి జాక్‌పాట్ కొట్టాడు!! View this post on Instagram A post shared by ShaadiSaga.com (@shaadisaga) -
వీడియో హల్ చల్.. ఎస్ఐ సస్పెన్షన్!
లక్నో (యూపీ): యువతులు డ్యాన్స్ చేస్తుండగా అదే పనిగా ఓ ఎస్ఐ వారినే చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ ఎస్సైని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఎస్పీ సుమిత్రా యాదవ్ వివరాల ప్రకారం... రాంపూర్ కళా పోలీస్ స్టేషన్లో సీతారాం స్వర్ణకర్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రాంపూర్ కళా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవంత్‌పూర్ రేవాలిలో ఓ పార్టీకి ఎస్ఐ గురువారం హాజరయ్యాడు. అయితే ఆ ప్రైవేట్ పార్టీలో కొందరు యువతులు, యువకులు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అందులోని ఇద్దరు యువకులు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ చర్యను అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకోవాల్సిన ఎస్ఐ సీతారాం వాటిని పట్టించుకోలేదు. మహిళల డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ పార్టీ వీడియోలో చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి యాక్షన్ తీసుకున్నారు. కాల్పులతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి లైసెన్స్ ఉన్న తుపాకీ, మరో గన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ సీతారాంను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వివరించారు.


