వీడియో హల్ చల్.. ఎస్ఐ సస్పెన్షన్! | SI seen enjoying girls dance in video, suspended | Sakshi
Sakshi News home page

వీడియో హల్ చల్.. ఎస్ఐ సస్పెన్షన్!

Jul 8 2016 5:29 PM | Updated on Oct 22 2018 6:02 PM

వీడియో హల్ చల్.. ఎస్ఐ సస్పెన్షన్! - Sakshi

వీడియో హల్ చల్.. ఎస్ఐ సస్పెన్షన్!

యువతులు డ్యాన్స్ చేస్తుండగా అదే పనిగా ఓ ఎస్ఐ వారినే చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

లక్నో (యూపీ): యువతులు డ్యాన్స్ చేస్తుండగా అదే పనిగా ఓ ఎస్ఐ వారినే చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ ఎస్సైని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఎస్పీ సుమిత్రా యాదవ్ వివరాల ప్రకారం... రాంపూర్ కళా పోలీస్ స్టేషన్లో సీతారాం స్వర్ణకర్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

రాంపూర్ కళా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవంత్పూర్ రేవాలిలో ఓ పార్టీకి ఎస్ఐ గురువారం హాజరయ్యాడు. అయితే ఆ ప్రైవేట్ పార్టీలో కొందరు యువతులు, యువకులు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అందులోని ఇద్దరు యువకులు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ చర్యను అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకోవాల్సిన ఎస్ఐ సీతారాం వాటిని పట్టించుకోలేదు. మహిళల డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు.

ఈ పార్టీ వీడియోలో చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి యాక్షన్ తీసుకున్నారు. కాల్పులతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి లైసెన్స్ ఉన్న తుపాకీ, మరో గన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ సీతారాంను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement