గత కొన్నాళ్లుగా సినిమాలతై చేస్తున్నాడు గానీ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కి సరైన హిట్ పడట్లేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్సయినట్లు ఉన్నాడు. ఈ క్రమంలోనే 'ఉరి' మూవీ తీసిన ఆదిత్య ధర్‌తో కలిసి ఓ మూవీ చేశాడు. అదే 'ధురంధర్'. భారత్ vs పాక్ ఉగ్రవాదం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.
(ఇదీ చదవండి: దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు)
4 నిమిషాలకు పైగానే ఉన్న ట్రైలర్ చూడటానికి బాగుంది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలు, ఒళ్లు జలదరించే కొన్ని సీన్స్‌తో నింపేశారు. రణ్‌వీర్ సింగ్ హీరో కాగా ఇతడికి జోడీగా సారా అర్జున్ నటించింది. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరి ఈసారైనా రణ్‌వీర్ హిట్ కొడతాడేమో చూడాలి?
(ఇదీ చదవండి: రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత)


