40 ఏళ్ల హీరోతో రొమాన్స్‌.. ట్రోల్స్‌ లెక్క చేయను | Sara Arjun About 20 Years Age Gap Between Ranveer Singh In Dhurandhar Movie | Sakshi
Sakshi News home page

Sara Arjun: 20 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌.. తొలిసారి పెదవి విప్పిన హీరోయిన్‌

Jan 21 2026 12:17 PM | Updated on Jan 21 2026 12:27 PM

Sara Arjun About 20 Years Age Gap Between Ranveer Singh In Dhurandhar Movie

'నాన్న', 'పొన్నియన్‌ సెల్వన్‌' సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్‌ 'ధురంధర్‌' సినిమాతో హీరోయిన్‌గా మారింది. తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్‌వీర్‌ సింగ్‌కు జంటగా నటించింది 20 ఏళ్ల సారా. దీంతో హీరోహీరోయిన్ల ఏజ్‌ గ్యాప్‌ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్‌పై తొలిసారి పెదవి విప్పింది సారా అర్జున్‌. 

అదే నమ్ముతా..
ఆమె మాట్లాడుతూ.. నేను సామాజిక మాధ్యమాల్లో చురుకుగా లేను. కాబట్టి అక్కడేం జరుగుతుందనేది నాకు పెద్దగా తెలీదు. ఈ ఏజ్‌ గ్యాప్‌ గొడవంతా సోషల్‌ మీడియాలోనే జరుగుతోందనుకుంటా.. అయినా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయం ఉంటుందని భావిస్తాను. ఎవరి జీవితం వాళ్లది అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను. కాబట్టి ఏజ్‌ గ్యాప్‌ నచ్చకపోవడమనేది వారి సమస్య. అది నన్ను ఏమాత్రం ప్రభావితం చేయదు. అలాంటివి నేను లెక్క చేయను. సినిమా కథేంటో నాకు తెలుసు. ఆ కథకు అనుగుణంగానే అందరూ నడుచుకున్నారు. అంతే..

కో స్టార్‌పై ప్రశంసలు
ఇకపోతే రణ్‌వీర్‌ సింగ్‌ లాంటి నటులను నేను చూడలేదు. ఎంతో అంకితభావంతో పని చేస్తాడు. సెట్‌లో ఉన్న అందరి గురించి పట్టించుకుంటాడు. సినిమా తీయడం అనేది దర్శకనిర్మాతల పని మాత్రమే కాదు.. సమిష్టి కృషి అని నమ్ముతాడు. సెట్‌ డిజైన్‌ దగ్గరి నుంచి అన్నింట్లోనూ పాలుపంచుకుంటాడు. అందర్నీ ఏకం చేసి ముందుకు నడిపిస్తాడు అంటూ హీరోపై ప్రశంసలు కురిపించింది.

సినిమా
ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ధురంధర్‌ సినిమా 2025 డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌, సారా అర్జున్‌ జంటగా నటించిన ఈ మూవీలో అక్షయ్‌ ఖన్నా, ఆర్‌ మాధవన్‌ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

చదవండి: రేణూ దేశాయ్‌ శాపనార్థాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement