
గోండు తెగల నేపథ్యంలో రష్మికా మందన్నా లీడ్ రోల్‌లో ‘మైసా’ చిత్రం ఆరంభమైంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్తపాత్రను రష్మిక చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈపాన్ ఇండియా మూవీని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
ఆదివారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అతిథిగాపాల్గొన్న దర్శకుడు రవికిరణ్ కోలా కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత డి. సురేష్ బాబు క్లాప్ కొట్టారు. దర్శకుడు హను రాఘవపూడి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేసి, తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం చేశారు. ‘‘హై ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్ పి. కృష్ణ.