రీసెంట్ టైంలో అడవి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా అనగానే చాలామందికి 'పుష్ప'నే గుర్తొస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో తీశారు. ఇప్పుడు ఈ తరహాలోనే ఏనుగు దంతాల స్మగ్లింగ్ నేపథ్య కథాంశంతో మలయాళంలో తీసిన పాన్ ఇండియా మూవీ 'కాటాలన్'. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: పోలీస్ కేసు.. యాంకర్ విష్ణుప్రియకే కలిసొచ్చింది!)
ట్రైలర్ చూస్తే ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేసే ముఠాల మధ్య ఆధిపత్య పోరు, ఇందులో హీరో ఏం చేశాడు అనేది కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. అయిత హీరోహీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్.. ఇలా ప్రతి ఒక్కరి చేతిలో గన్ లేదంటే కత్తి కనిపించాయి. బుల్లెట్ పేల్చడం లేదంటే రక్తపాతం సృష్టించడం లాంటివి కనిపిస్తున్నాయి. అలానే ట్రైలర్‌కి మూడు డిఫరెంట్ థీమ్ మ్యూజిక్స్ అనే కొత్త ప్రయోగం చేశారు. ఇది కూడా ఆసక్తికరంగా అనిపించింది. 'మార్కో' లాంటి వయలెంట్ మూవీ తీసిన నిర్మాతలే దీన్ని తెరకెక్కించారు. తెలుగు నటుడు సునీల్.. ఇందులో ఓ విలన్‌గా చేయడం విశేషం.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)


