
ప్రముఖ బుల్లితెర నటి గౌహర్ ఖాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ముద్దుగుమ్మ.. తాజాగా రెండో బిడ్డ పుట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా పంచుకుంది. సెప్టెంబర్ 1వ తేదీన తనకు బిడ్డ జన్మించాడని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నటీనటులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే సీమంతం వేడుక గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
కాగా.. గౌహర్ ఖాన్ 2020లో సంగీత స్వరకర్త ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు జైద్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట మే 2023లో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఏప్రిల్ 2025లో సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. ఇక కెరీర్ విషయానికొస్తే గౌహర్ ఖాన్ బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. ఆమె ఇటీవల ఇషా మాల్వియాతో కలిసి లవ్లీ లోల్లాలో కూడా కనిపించింది. అంతేకాకుండా హిందీ బిగ్‌బాస్‌లో విన్నర్‌గా నిలిచింది.